Site icon NTV Telugu

Pemmasani Chandrasekhar: నా విజయం ఖరారు.. భారీ మెజార్టీ సాధిస్తా

Pemmasani

Pemmasani

Pemmasani Chandrasekhar: నా విజయం ఖరారైంది.. భారీ మెజార్టీతో విజయం సాధిస్తాను అన్నారు గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్.. భారీ ర్యాలీగా వెళ్లి ఈ రోజు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఇక, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.. టీడీపీ అధినేత చంద్రబాబు.. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ప్రకటించారు.

Israel: ఇజ్రాయెల్‌లో కీలక పరిణామం.. సైన్యాధిపతి రాజీనామా

పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఆనుహ్యమైన ప్రజా స్పందనకు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. ఓటింగ్ నాడు కూడా ఇదేవిధమైన ప్రజాస్పందన ఉంటుందన్నారు. భారీ ర్యాలీ వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు.. వారికి నా క్షమాపణలు అన్నారు. నా విజయం ఖరారు అయ్యింది.. భారీ మెజార్టీతో విజయం సాధిస్తాను అని ధీమా వ్యక్తం చేశారు.. గుంటూరు పార్లమెంట్ ప్రజలకు కఠంలో ప్రాణం ఉన్నంత వరకు సేవ చేస్తాను అన్నారు. అవినీతికి తావు లేనీ రాజకీయాలు నేను చేస్తాను అని స్పష్టం చేశారు గుంటురు లోక్‌సభ టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్.

Exit mobile version