Site icon NTV Telugu

HCA – TCA: హెచ్‌సీఏపై బీసీసీఐకి ఫిర్యాదు చేసిన టీసీఏ..

Hca

Hca

HCA Corruption Allegations: HCA..! హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌గా కంటే.. హైదరాబాద్‌ మోస్ట్‌ కరప్టెడ్‌ అసోసియేషన్‌గానే పేరు గడించింది. ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌కు కేంద్రంగా ఉన్న అసోసియేషన్‌.. ఇప్పుడు అవినీతి ఆరోపణలు, అంతర్గత కుమ్ములాటలు, కేసులు, అరెస్ట్‌‌లకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా ఉన్న జగన్మోహన్‌రావుతో సహా సెక్రెటరీ దేవరాజ్‌, ట్రెజరర్‌ శ్రీనివాసరావు అరెస్ట్‌ అయ్యారు. పలు కేసుల్లో కేసుల్లో జైలు శిక్ష అనుభవించి ప్రస్తుతం బెయిల్‌‌పై బయటకు వచ్చారు. దేశవ్యాప్తంగా హెచ్‌సీఏ పరువు బజారునపడింది. ఐనా… హెచ్‌సీఏ తీరు మారడం లేదు. జగన్మోహన్‌ అరెస్ట్‌ తర్వాత దల్జీత్‌ సింగ్‌ తనకు తాను ప్రెసిడెంట్‌గా ప్రకటించుకుని.. తన మార్క్‌ అవినీతి రాజకీయం మొదలుపెట్టాడు. తాజాగా HCA లో జరుగుతున్న అవినీతి మరోసారి బట్టబయలైంది.

READ ALSO: Minister Damodar Rajanarasimha: జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

అండర్‌ 14 సెలక్షన్స్‌ నిర్వహించింది హెచ్‌సీఏ. దీనికి 3 వేల మందికి పైగా క్రీడాకారులు సెలక్షన్స్‌కి అటెండ్‌ అయ్యారు. జింఖానా గ్రౌండ్స్‌ వద్ద ఈ జూనియర్‌ క్రికెటర్లు నానా అవస్థలు పడ్డారు. గుక్కెడు మంచినీళ్లు కూడా లేకుండా గంటల తరబడి క్యూలో ఉండిపోయారు. తీరా చూస్తే… అసలు అండర్‌ 14 సెలక్షన్స్‌ అనే మాట బీసీసీఐ డిక్షనరీలోనే లేదు. ఉద్దేశపూర్వకంగానే.. అండర్‌ 14 పేరుతో డబ్బులు దండుకునే కుట్ర జరిగిందని ఆరోపించింది తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌. ఇదే విషయమై బీసీసీఐకి కూడా ఫిర్యాదు చేశారు TCA సెక్రెటరీ గురువారెడ్డి.

తాజాగా మంత్రి వివేక్‌.. తన తండ్రి జి.వెంకటస్వామి పేరుతో తెలంగాణ వ్యాప్తంగా డిస్ట్రిక్ట్‌ టీ20 క్రికెట్‌ లీగ్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో హెచ్‌సీఏ భాగస్వామిగా ఉంది. మంత్రి వివేక్‌ రూ.1.70 కోట్ల స్పాన్సర్‌షిప్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. క్రికెట్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మంత్రుల జోక్యం ఉండకూడదన్న నిబంధన బేఖాతర్‌ చేశారు. హెచ్‌సీఏ నుంచి తనకు రూ.67 కోట్ల బకాయి రావాలని కొట్లాడుతున్న వివేక్‌, ఇప్పుడు రూ.1.70 లక్షలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నాయి క్రికెట్‌ సంఘాలు. ఏసీబీ, సీఐడీ కేసుల కారణంగా హెచ్‌సీఏ బ్యాంక్‌ అకౌంట్లు అన్నీ బ్లాక్‌‌లో ఉన్నప్పుడు, మంత్రి వివేక్‌ ఇచ్చిన రూ.1.70 లక్షలు ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయి ప్రశ్నిస్తోంది తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌. తెలంగాణలో TCA కు సంబంధం లేకుండా ఎలాంటి డిస్ట్రిక్ట్‌ టోర్నీలు నిర్వహించడానికి వీలే లేదని బీసీసీఐ ఆదేశాలు ఉన్నా, బేఖాతర్‌ చేస్తున్నారని TCA మండిపడుతోంది. హెచ్‌సీఏ గద్దెలో ఎవరున్నా.. అప్పనంగా వచ్చిన నిధులను మింగేయడం, తమ జేబుల్లోకి మళ్లించుకోవడమే పనిగా పెట్టుకున్నారు హెచ్‌సీఏ పెద్దలు. సహచర సభ్యులు అవినీతి, అక్రమాలకు పాల్పడి జైలు పాలైనా, తీరు మార్చుకోవడం లేదని మండిపడుతున్నాయి క్రికెట్‌ సంఘాలు.

READ ALSO: Atal Modi Suparipalana Yatra: దేశసేవకు వాజ్‌పేయ్ జీవితాన్ని అంకితం చేశారు: ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్

Exit mobile version