Site icon NTV Telugu

Tata Nano: బైకు ధరకే కారు!.. సొంత కారు కల నెరవేర్చుకోవాలనుకునే వారికి టాటా ఓ వరం

Tata Nano

Tata Nano

సొంత కారు ఉండాలని చాలా మంది కలలు కంటుంటారు. కానీ, అధిక ధరల కారణంగా కారు కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. అరకొర ఆదాయాలతో లక్షలు వెచ్చించి కారు కొనలేరు కదా. ఇలాంటి వారి కోసం టాటా కంపెనీ ఓ వరంలా నిలవబోతోంది. సొంత కారు కలను నెరవేర్చుకునేందుకు రెడీగా ఉండండి. కేవలం బైకు ధరకే కారు రాబోతోంది. అదెలా అంటారా.. టాటా నానో మళ్లీ మార్కెట్ లోకి రాబోతోంది. కొన్నేళ్ల క్రితం రూ. లక్ష ధరతో టాటా నానో కారు ఆటో మొబైల్ ఇండస్ట్రీలో పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఐకానిక్ కారు (టాటా నానో 2025) మార్కెట్లోకి తిరిగి వస్తోంది.

Also Read:Test Tube Baby : సికింద్రాబాద్‌ IVF సెంటర్ షాకింగ్ స్కామ్.. భర్త వీర్యానికి బదులు మరొకరిది.?

40 kmpl మైలేజ్‌తో రానున్నట్లు సమాచారం. ఇది నగర డ్రైవర్లకు, మొదటిసారి కారు కొనుగోలు చేసేవారికి బెస్ట్ ఆప్షన్. తక్కువ ధరలో కారు కోసం చూస్తున్న చిన్న కుటుంబాలకు ఇది సరైన ఎంపిక. కొత్త టాటా నానో షడ్భుజి ఫ్రంట్ గ్రిల్, LED హెడ్‌ల్యాంప్‌లు, డేటైమ్ రన్నింగ్ లైట్లు (DRL)తో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ లాగా కనిపిస్తుంది. బోల్డ్ అల్లాయ్ వీల్స్, కొత్త కలర్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కేవలం 3.1 మీటర్ల పొడవు, 180 mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో, ఇది భారత్ లోని బిజీ నగర ట్రాఫిక్, పార్కింగ్‌కు అనుకూలంగా ఉండనున్నది.

Also Read:Shruti Haasan: నేను ఆయన కూతుర్ని కాదు.. అందుకే కూలీ ఒప్పుకున్నా!

పలు రిపోర్ట్ ల ప్రకారం.. ఇది 624 cc ట్విన్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది దాదాపు 38 PS శక్తిని, 51 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్ ఎంపికలలో 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉన్నాయి. టర్బో-పెట్రోల్, CNG, EV మోడల్‌లు కూడా భవిష్యత్తులో తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇవి 250 కి.మీ వరకు ప్రయాణించగలవు.

Also Read:Manipur: మణిపూర్‌లో భారీగా గన్స్, బుల్లెట్స్, గ్రెనేడ్స్ స్వాధీనం..

ప్రీమియం లుక్స్ ఈ కారులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే), డిజిటల్ డ్రైవర్ క్లస్టర్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్, USB, AUX సపోర్ట్, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ ఉన్నాయి. సన్‌రూఫ్, సౌకర్యవంతమైన రిక్లైనింగ్ ఫ్రంట్ సీట్లు కూడా ఉన్నాయి. భద్రతా లక్షణాలలో 4 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో ABS, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, కెమెరా, బలమైన స్టీల్ బాడీ షెల్, సీట్‌బెల్ట్ రిమైండర్‌లు, ESC, సైడ్ ఇంపాక్ట్ బీమ్‌లు ఉన్నాయి. ఫీచర్లతో కూడిన టాటా నానో 2025 ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 2.80 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే కొన్ని ప్రారంభ ట్రిమ్‌లు దాదాపు రూ. 1.45 లక్షల వరకు అందుబాటులో ఉండవచ్చు. EV వేరియంట్ ధర రూ. 5-7 లక్షల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నాయి మార్కెట్ వర్గాలు.

Exit mobile version