NTV Telugu Site icon

Tata Group: విద్యుత్‌ వాహనాల బ్యాటరీల తయారీ

Tata Group

Tata Group

Tata Group: విద్యుత్‌ వాహనాలకు కావాల్సిన బ్యాటరీల తయారీ కోసం టాటా గ్రూపు యూరప్‌లో యూనిట్‌ను ఏర్పాటుచేయనుంది. ఈ మేరకు ప్రణాళికలు రచిస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ సంస్థ తన నివేదికలో పేర్కొంది. టాటా మోటార్స్‌ తన అనుబంధ కంపెనీ జాగ్వర్‌ ల్యాండ్‌ రోవర్‌తో కలిసి ఈ ఫెసిలిటీని అందుబాటులోకి తేనుంది. అక్కడి నుంచే సెల్‌ బ్యాటరీ ప్యాక్‌లను ప్రపంచవ్యాప్తంగా విక్రయించనుంది.

read more: Minister KTR: లోకల్ టు గ్లోబల్ లీడర్.. కేటీఆర్

యూరప్‌లో ఏర్పాటుచేయనున్న ఈ యూనిట్‌లో లిథియం ఐరన్‌ ఫాస్ఫేట్‌ సెల్స్‌ మరియు నికెల్‌ మ్యాంగనీస్‌ కోబాల్ట్‌ సెల్స్‌ తయారుచేయనుంది. లిథియం సెల్స్‌ను టాటా మోటార్‌ విద్యుత్‌ వాహనాలకు వినియోగించనున్నారు. నికెల్‌ సెల్స్‌ను టాటా మోటార్స్‌తోపాటు జాగ్వర్‌ ల్యాండ్‌ రోవర్‌ వాహనాలకి కూడా ఉపయోగించనున్నారు. యూరప్‌లో ఏర్పాటుచేయనున్న యూనిట్‌కి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు టాటా మోటార్స్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ పీబీ బాలాజీ పేర్కొన్నారు.

ఢిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో సందర్భంగా నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ వివరాలను తెలిపారు. టాటా మోటార్స్‌ మరియు జాగ్వర్‌ ల్యాండ్‌ రోవర్‌ కలిసి నడవటం వల్ల వివిధ దేశాలకు ఉత్పత్తుల సరఫరాలో ఎలాంటి ఆటంకాలూ ఏర్పడవని, కరోనా నాటి ఇబ్బందులు తప్పుతాయని భావిస్తున్నారు.