NTV Telugu Site icon

Tata Water : బిస్లరీ మార్కెట్‌ను స్వాధీనం చేసుకునేందుకు టాటా గ్రూప్ ప్లాన్

New Project (4)

New Project (4)

Tata Water : బాటిల్ వాటర్ మార్కెట్లో సంచలనం సృష్టించే దిశగా టాటా గ్రూప్ సన్నాహాలు చేస్తోంది. బిస్లరీతో ఒప్పందం విఫలమవడంతో, టాటా గ్రూప్ సొంతంగానే మార్కెట్‌లోకి ప్రవేశించబోతోంది. ప్రస్తుతం భారతదేశంలోని బాటిల్ వాటర్ వ్యాపారంలో బిస్లరీ ఆధిపత్యం చెలాయిస్తోంది. బిస్లరీకి ప్రస్తుతం ప్రధాన పోటీదారు లేడు. బిస్లరీ గ్రూప్‌ను కొనుగోలు చేసే చర్చలు విఫలమయ్యాయి. టాటా గ్రూప్ ఇప్పుడు బాటిల్ వాటర్ మార్కెట్‌లో ప్రధాన వాటాను స్వాధీనం చేసుకోవాలనుకుంటోంది. ఇందుకోసం ఈ బృందం గట్టి ప్రణాళికను సిద్ధం చేసింది.

Read Also: Tulasi In Milk : తులసి ఆకుల పాలు తాగితే కిడ్నీలో రాళ్లు ఐస్ లా కరుగుతాయి

బాటిల్ వాటర్ బిజినెస్ లోకి అడుగుపెట్టబోతున్నాం అని టాటా గ్రూప్ చెప్పిందంటే ఈ మార్కెట్ ఎంత పెద్దదవుతుందో ఊహించుకోవచ్చు. మార్కెట్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ టేకేసాయి రీసెర్చ్ దీనిపై నివేదించింది. దీని ప్రకారం, బాటిల్ వాటర్ వ్యాపారం చిన్నది కాదు. 2021లో ఈ మార్కెట్ విలువ 243 కోట్ల డాలర్లు అంటే దాదాపు రూ.20,03,89,95,000. కాబట్టి టాటా గ్రూప్ ఈ మార్కెట్‌లో తన ఉనికిని చాటుకోవాలనుకుంటోంది.

Read Also: Fire accident: హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. కారులోనే సెక్యూరీటి గార్డ్ సజీవ దహనం

టాటా గ్రూప్ ఇప్పటికే బాటిల్ వాటర్ వ్యాపారంలోకి ప్రవేశించింది. టాటా గ్రూప్ బ్రాండ్లు హిమాలయన్, కాపర్ ప్లస్ (టాటా కాపర్+), టాటా గ్లూకో+ ఇప్పటికే మార్కెట్‌లో ఉన్నాయి. అయితే ఈ సెగ్మెంట్లో టాటా గ్రూప్ బలమైన పట్టు సాధించేందుకు సిద్ధమవుతోంది. అందుకోసం ఈ గ్రూప్‌ను విస్తరించనున్నారు. టాటా గ్రూప్ టాటా కాపర్ ప్లస్ విలువ రూ. 400 కోట్లు, హిమాలయన్ రెండు బ్రాండ్‌లను పెంచడానికి ప్రయత్నిస్తోంది. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఇప్పుడు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ను విస్తరించాలని ప్లాన్ చేసింది.