Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamim Iqbal: బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (Tamim Iqbal) అధికారికంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జూన్ 7న జరిగిన బోర్డు సమావేశంలో ఆయనను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో 37 ఏళ్ల వయసులో బీసీబీ అధ్యక్ష పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా తమీమ్ చరిత్ర సృష్టించారు.
గత ఏప్రిల్‌లో బంగ్లాదేశ్ ప్రభుత్వం బీసీబీ డైరెక్టర్ల బోర్డును రద్దు చేసిన తర్వాత తమీమ్ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన బీసీబీ ఎన్నికలపై వచ్చిన ఆరోపణలను విచారించిన ఐదుగురు సభ్యుల కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం మీడియాతో మాట్లాడిన తమీమ్.. గత ఏడాదిన్నర కాలంగా బంగ్లాదేశ్ క్రికెట్ ఎదుర్కొన్న సంక్షోభాన్ని ప్రస్తావించారు. “గత ఏడాదిన్నరలో జరిగిన పరిణామాలు సరైనవి కావు. అయితే ఎవరినీ నిందించాలనే ఉద్దేశం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి బయటపడాలంటే అందరి సహకారం అవసరం. ఒక్కరి వల్ల ఇది సాధ్యం కాదు” అని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Student Death: సీఎంతో మాట్లాడిన విద్యార్థిని ఆత్మహత్య.. రంపచోడవరంలో కలకలం!
- Bhatti Vikramarka: ఏ విద్యార్థి ఆకలితో ఉండకూడదు.. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభం.!
- రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
- Cyber Fraud: సైబర్ మోసాల బారిన ప్రజలు.. రూ.2.10 కోట్లకు పైగా టోకరా.!
బంగ్లాదేశ్ క్రికెట్ ప్రతిష్ఠకు జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తప్పులు జరిగితే వాటిపై నిర్మాణాత్మక విమర్శలు చేయాలని, అలాంటి సూచనల ద్వారా బోర్డు మరింత మెరుగైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ మీడియాతో క్రమం తప్పకుండా మాట్లాడతానని.. బోర్డు భవిష్యత్ కార్యాచరణపై పారదర్శకంగా వ్యవహరిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు బోర్డుకు ఉపాధ్యక్షుడి నియామకాన్ని కూడా ప్రతిపాదించినట్లు తమీమ్ వెల్లడించారు. ఆ ప్రతిపాదన మేరకు ఫహీమ్ సిన్హాను ఇద్దరు ఉపాధ్యక్షుల్లో ఒకరిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. మరో ఉపాధ్యక్షుడి ఎంపిక ఇంకా జరగలేదని, అవసరమైతే భవిష్యత్తులో మరిన్ని నియామకాలు చేపడతామని వివరించారు.
- Tags
తాజావార్తలు
-
Student Death: సీఎంతో మాట్లాడిన విద్యార్థిని ఆత్మహత్య.. రంపచోడవరంలో కలకలం!
-
Bhatti Vikramarka: ఏ విద్యార్థి ఆకలితో ఉండకూడదు.. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభం.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
Bihar Bandh AK-47 Firing: విద్యార్థుల నిరసనలో.. ఏకే-47తో కాల్పులు జరిపిన కానిస్టేబుల్ సస్పెండ్..
-
Mahendragiri Varahi: ‘మహేంద్రగిరి వారాహి’లో ఓ బిగ్ హీరో సర్ప్రైజ్ రోల్.. రిలీజ్ డేట్ ప్రెస్మీట్లో నిర్మాత రివీల్
ట్రెండింగ్
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!