Site icon NTV Telugu

Tamilnadu : చెన్నైలో భారీగా వర్షాలు.. ఆ జిల్లాలకు అలెర్ట్..

Chainna

Chainna

తమిళనాడులో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.. చెన్నైలో వర్షాలు కురుస్తున్నాయని తెలుస్తుంది.. గత కొన్ని రోజుల క్రితం కురుసిన వర్షాలకు రాష్ట్ర ప్రజలు ఇంకా తేరుకోలేదు.. ఇప్పుడు మళ్ళీ వర్షాల గురించి చెప్పడంతో జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. చెన్నైతో పాటు పొరుగు జిల్లాల్లో రాత్రిపూట వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి..

గురువారం నుంచి ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో తమిళనాడు లోని చెన్నై లో గురువారం నుంచి మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఆగ్నేయదిశగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఆవరించడం తో చెన్నై నగరం, పొరుగునున్న జిల్లాల్లో తుపాన్‌తో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

కోయంబేడు, మాంబళం తిరువల్లూరు, కాంచీపురం, చెన్నై, చెంగల్పట్టు, విల్లుపురం, కుద్దలూరు, మైలాదుతురై, నాగపట్నం, తిరువరూరు, తంజావూరు, పుదుక్కొట్టై , రామనాథపురం, తూతుకూడి జిల్లా ల్లోను, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో గురువారం నుంచి మూడు రోజుల పాటు వరుసగా భారీ వర్షాలు కురిసాయి. చాలా చోట్ల నీరు నిలిచిపోవడంతో ఉదయం కార్యాలయాలకు వెళ్లేవారు ఇబ్బంది పడ్డారు.. మరింత వర్షం కురిసే అవకాశం ఉన్నందున విపత్తు ప్రతిస్పందన బృందాలు సిద్ధంగా ఉన్నాయి.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు అధికాలు హెచ్చరిస్తున్నారు.. అప్రమత్తంగా ఉండాలి చెబుతున్నారు..

Exit mobile version