NTV Telugu Site icon

CM Morning Walk: సీఎం సింప్లిసిటీ.. నెటిజన్స్ ఫిదా

Stalin

Stalin

CM Morning Walk: ఆయనో రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అయినా మనలో ఒకడిగా సింపుల్‎గా ఉండడమే ఆయన నైజం. ఎక్కడికి వెళ్లినా తనదైన శైలిలో సాధారణ తెల్లని దుస్తులతో వెళ్తుంటారు. హంగు ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. పెద్దగా సెక్యురిటీ ఉండదు. ఎక్కడికి వెళ్లినా అందరినీ చిరునవ్వుతో పలుకరిస్తూ సామన్యుల్లో ఒకరిగా మెలిగిపోతుంటారు. అందుకే ఆయనకు ప్రజలు జేజేలు పలుకుతారు.

Read Also: Mahesh Babu: బెజవాడలో మహేశ్ బాబు.. తండ్రి అస్థికలను కృష్ణలో కలిపేందుకు..

ప్రజా సంక్షేమమే తన ఎజెండాగా పాలనలో దూసుకుపోతున్న ఆ నేత ఎవరో గుర్తు పట్టారా.. ఆయనేనండి తమిళనాడు సీఎం స్టాలిన్. ఊటీలో సీఎం స్టాలిన్ ఒంటరిగా వాకింగ్ చేస్తూ కనిపించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వెంట భద్రతా సిబ్బంది లేకుండా పచ్చటి చెట్ల మధ్య సరదాగా మార్నింగ్ వాక్ చేస్తూ కనిపించారు. అంతే కాకుండా ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ నటించిన సినిమా పై ఆరా తీశారు. అనంతరం చైన్నైలోని గోపాలపురంలో 53 వికలాంగ జంటల వివాహం జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సతీసమేతంగా పెళ్లికి హజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఓ ప్రైవేటు ట్రస్ట్ గత 11 సంవత్సరాలుగా ఉచిత వివాహాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా 53 మంది వికలాంగ జంటలకు సామూహిక వివాహం చేయించారు.