జూనియర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివదర్శకత్వంలో వచ్చిన దేవర. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. గతేడాది రిలీజ్ అయినా ఈ సినిమా ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో చెప్పక్కర్లేదు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా . ఫైనల్ రన్ లో ఏకంగా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read : Pawan Kalyan : కాంతార 1.. ఏపీలో టికెట్ హైక్ వివాదం.. కందుల దుర్గేష్ కు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
అయితే దేవర 2 ఉండబోదని ఎన్టీఆర్ అందుకె వేరే సినిమాలను లైన్ లో పెట్టాడని ఆ మధ్య వార్తలు వినిపించాయి. కానీ దేవర 2 అనే చిత్రం తప్పకుండా ఉంటుందని మేకర్స్ ఇటీవల మరోసారి స్పష్టం చేసారు. నవంబర్ లేదా డిసెంబర్ కల్లా డ్రాగన్ షూట్ కంప్లీట్ చేయబోతున్నారు యంగ్ టైగర్. ఈ నేపధ్యంలోనే దేవర 2 కు ప్లాన్ రెడీ చేస్తున్నాడు తారక్. అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నుండి దేవర 2 షూట్ మొదలు పెట్టేలా ప్లానింగ్ జరుగుతుంది. కొరటాల శివ స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ గా ఉన్నారు. ముందు అనుకున్న స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసి ఫైనల్ వర్షన్ రెడీ చేసే పనిలో ఉన్నాడు కొర్రీ. అలాగే ఈ సినిమా కోసం మరికొందరు స్టార్స్ ను తీసుకోబోతున్నాడట కొరటాల. తమిళ యంగ్ హీరో శింబుకు కథ వినిపించగా దేవర 2లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట శింబు.
