Tamilnadu : తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా నజరేత్ సమీపంలోని బాణాసంచా ఫ్యాక్టరీ గోదాములో శనివారం సాయంత్రం జరిగిన పేలుడులో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, ఇద్దరు మహిళలు సహా నలుగురు గాయపడ్డారు. పటాకులను ఒకచోటి నుంచి మరోచోటికి తరలిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున సాయం ప్రకటించారు.
Read Also:Red Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్..
పేలుడులో నలుగురికి గాయాలు
ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారని, వారిని కన్నన్, విజయ్‌లుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. మరో నలుగురిని చికిత్స నిమిత్తం తిరునల్వేలి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో సెల్వం, ప్రశాంత్, సెందూర్కని, ముత్తుమారి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నట్లు పత్రికా ప్రకటనలో తెలిపారు.
Read Also:Weather Update: తీరం దాటిన వాయుగుండం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు
సీఎం సాయం ప్రకటించారు
ప్రైవేట్ బాణసంచా ఫ్యాక్టరీలో అనూహ్య పేలుడు సంభవించి మరణించిన వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు. ప్రమాదవశాత్తు పేలుడులో గాయపడిన వారికి రూ.లక్ష సాయం అందజేస్తామని తెలిపారు.
