NTV Telugu Site icon

Vadakkupatti Ramasamy : ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Whatsapp Image 2024 03 12 At 12.22.37 Pm

Whatsapp Image 2024 03 12 At 12.22.37 Pm

సంతానం, మేఘా ఆకాష్ జంటగా నటించిన మూవీ వడక్కుపట్టి రామసామి.. ఈ మూవీ ఫిబ్రవరి 2న తమిళంలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. 1960, 70 కాలంలో జరిగిన కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందింది.పీరియాడికల్ కామెడీ మూవీగా వచ్చిన ఈ సినిమాకు కార్తిక్ యోగి దర్శకత్వం వహించాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. మంగళవారం నుంచి అమెజాన్‌ప్రైమ్‌ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.గతంలో సంతానం దర్శకుడు కార్తిక్ యోగి కాంబినేషన్‌లో డిక్కీలోనా అనే మూవీ తెరకెక్కింది. ఈ మూవీ కమర్షియల్ సక్సెస్‌గా నిలవడంతో వడక్కుపట్టి రామసామిపై అంచనాలు ఏర్పడ్డాయి. సంతానం కామెడీ బాగుందనే పేరొచ్చిన రోటీన్ స్టోరీ కారణంగా సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.

ఓ ఊరిలో గుడి, దేవుడు పేరు చెప్పుకొని డబ్బులు గడిస్తుంటాడు రామసామి. అతడిపై కోపంతో కొందరు శత్రువులు గుడిని మూసేస్తారు. ఆ గుడిని తిరిగి తెరవడానికి రామసామి ఏం చేశాడు.. ఓ డాక్టర్‌తో ప్రేమలో పడ్డ రామసామి ప్రియురాలి మనసును ఎలా గెలిపించుకున్నాడు.. అన్నదే ఈ మూవీ కథ.వడకట్టు రామసామి మూవీని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ సినిమాతోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ పవన్ కళ్యాణ్‌ మరియు రవితేజ వంటి స్టార్ హీరోలతో సినిమాలను నిర్మిస్తోన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తమిళంలోకి మాత్రం సంతానం మూవీతో అరంగేట్రం చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే ఫస్ట్ మూవీ వారికి నిరాశనే మిగిల్చింది.దాదాపు 12 కోట్ల బడ్జెట్‌తో వడక్కుపట్టి రామసామి మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. థియేటర్లలో ఈ మూవీ కేవలం ఐదున్నర కోట్ల వరకు మాత్రమే వసూళ్లను రాబట్టింది. నిర్మాతలకు ఆరు కోట్లకుపైగా నష్టాలను తెచ్చిపెట్టింది. వడక్కుపట్టి రామసామి మూవీ తెలుగు వెర్షన్ త్వరలోనే స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం