Priyanka Mohan : చీర కట్టులో మెస్మరైజ్ చేస్తున్న తమిళ్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ బ్యూటీ ప్రియాంక మోహన్ వరుస సినిమా ఆఫర్స్ దక్కించుకుంటూ దూసుకుపోతుంది.ఈ భామకు తెలుగులో కూడా భారీ ఆఫర్లు వస్తున్నాయి . వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు ఈ ముద్దుగుమ్మ సిద్ధమవుతోంది.ఈ చెన్నై బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ ఇప్పటికే నాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. నేచురల్ స్టార్ నాని సరసన ‘గ్యాంగ్ లీడ్ర్’ చిత్రంలో ఈ భామ హీరోయిన్ గా నటించి మెప్పించింది. తన క్యూట్ లుక్స్ తో అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.గ్యాంగ్ లీడర్ సినిమా తర్వాత తెలుగులో ప్రియాంక మోహన్ నటించిన చిత్రం ‘ శ్రీకారం’. ఈ సినిమాలో శర్వానంద్ సరసన ప్రియాంక హీరోయిన్ గా నటించింది.. ఈ మూవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ బ్యూటీఫుల్ హీరోయిన్ గా మాత్రం ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ రెండు సినిమాల తర్వాత తెలుగులో కాస్త గ్యాప్ తీసుకుంది ఈ భామ.ఇప్పుడు మళ్లీ వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ – సుజీత్ ప్రాజెక్ట్ ఓజి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో తెలుగులో ఈ అమ్మడు కెరీర్ మరో మలుపు తిరుగుతుందని అభిమానులు కూడా ఆశిస్తున్నారు.
అలాగే టాలీవుడ్ లో మరో చిత్రంలో కూడా ఛాన్స్ దక్కించుకుంది.నేచురల్ స్టార్ నాని – వివేక్ ఆత్రేయ కాంబోలో రాబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ లో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా ఎంపికైందంటూ టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ బ్యూటీ మరిన్ని సినిమాలు ఓకే చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.ఇక తమిళంలో ప్రియాంక మోహన్ మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. ధనుష్ తో భారీ బడ్జెట్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’ అలాగే జయం రవితో ‘బ్రదర్’ అనే చిత్రంలో ప్రియాంక నటిస్తోంది. ఇక విజయ్ దళపతి 68వ చిత్రంలో ఈ భామ ఆఫర్ దక్కించుకుంది.. దీంతో ఈ భామ వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది.ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలోనూ ప్రియాంక మోహన్ ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన బ్యూటీఫుల్ ఫొటోలను షేర్ చేస్తుంది.. గ్లామర్ షోకు దూరంగా ఉండే ఈ బ్యూటీ చీర కట్టు లో కనిపించి ఆకట్టుకుంటుంది.. తాజాగా ఈ బ్యూటీ ఆరెంజ్ శారీలో మెరిసి మెస్మరైజ్ చేసింది. క్యూట్ లుక్స్ తో కుర్రాళ్లకు క్రష్ గా మారింది..
Also Read
- Aadhaar Free Update Deadline: ఆధార్ అప్డేట్ డెడ్‌లైన్ మిస్ అయితే ఇబ్బందులే.. UIDAI కీలక సూచనలు
- Used Oil: హైదరాబాద్ హోటల్స్‌లో వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడేస్తున్నారు.. ఫ్రీజర్‌లో కుళ్లిపోయిన ఆహారం..
- Tech Layoffs: ఏడాదిలో రెండుసార్లు ఉద్యోగం పోయింది.. ‘‘సాఫ్ట్వేర్ కెరీర్ వదిలేయాలా?’’
- AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Aadhaar Free Update Deadline: ఆధార్ అప్డేట్ డెడ్‌లైన్ మిస్ అయితే ఇబ్బందులే.. UIDAI కీలక సూచనలు
-
Used Oil: హైదరాబాద్ హోటల్స్‌లో వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడేస్తున్నారు.. ఫ్రీజర్‌లో కుళ్లిపోయిన ఆహారం..
-
Tech Layoffs: ఏడాదిలో రెండుసార్లు ఉద్యోగం పోయింది.. ‘‘సాఫ్ట్వేర్ కెరీర్ వదిలేయాలా?’’
-
Nani: “శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా”: నాని
-
AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?