NTV Telugu Site icon

Bigg boss 6: ‘బబ్లీ బౌనర్స్ ‘ మనసు గెలుచుకున్నది ఎవరంటే…

Tamanna

Tamanna

బిగ్ బాస్ సీజన్ 6 రెండోవారంలో మూడు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ జరిగాయి. అందులో ఒకటి ఇప్పటికే విడుదలైపోయిన ‘ఒకే ఒక్క జీవితం’ కాగా, మరొకటి శుక్రవారం విడుదలైన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మూవీ. ఇక మూడో సినిమా వచ్చే శుక్రవారం విడుదల కాబోతున్న తమన్నా ‘బబ్లీ బౌనర్స్’కు సంబంధించింది. ఆదివారం ఎపిసోడ్ లో మిల్కీబ్యూటీ తమన్నా… బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళింది. ఆమెను కంటెస్టెంట్స్ కాసేపు ఎంటర్ టైనర్ చేయగా, తమన్నా వారితో ఇంటరాక్ట్ అయ్యి తాను కొంత సేద తీరింది. ఈ సీజన్ లో ఏ వారానికి ఆ వారం కంటెస్టెంట్స్ లో ఒకరిని బెస్ట్ పర్శన్ గా ఎంపిక చేసి బిగ్ బాస్ కానుక ఇస్తున్నాడు. ఈవారం ఆ విజేతను ఎంపిక చేసే పనిని తమన్నాకు నాగార్జున అప్పగించాడు. బిగ్ బాస్ హౌస్ లోకి గెస్ట్ గా ఎంటర్ అయిన తమన్నా నాగార్జున సహకారంతో కొన్ని పోటీలు పెట్టింది. వీటి మధ్యలో తన రాబోయే సినిమా ‘బబ్లీ బౌన్సర్’ ట్రైలర్ నూ వీక్షకులకు చూపించింది. ‘ఈ మూవీని థియేటర్లకు వెళ్ళి చూడాల్సిన అవసరం లేదని ఎంచక్కా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఎక్కడైనా, ఎప్పుడైనా చూడొచ్చ’ని తమన్నా చెప్పగానే, అక్టోబర్ 5న వస్తున్న తన సినిమా ‘ది ఘోస్ట్’ను మాత్రం థియేటర్లలోనూ చూడాలంటూ నాగార్జున సరదాగా కామెంట్ చేశారు.

 

‘బబ్లీ బౌన్సర్’ మూవీలో దేశీ పహిల్వాన్ పాత్రను తమన్నా పోషించింది. దానికి తగ్గట్టుగానే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు కొన్ని పోటీలు నిర్వహించింది. తమను కాపాడటానికి హౌస్ లోని వారిలో ఏ లేడీని బౌన్సర్ గా పెట్టుకుంటారని అడిగినప్పుడు గీతూ వైపు ముగ్గురు కంటెస్టెంట్స్ మొగ్గు చూపారు. ఆది రెడ్డి, బాలాదిత్య, రేవంత్ తమకు గీతూ బౌన్సర్ గా ఉండాలని కోరారు. ఇక తమన్నాను ఇంప్రస్ చేయమని మేల్ కంటెస్టెంట్స్ లో నలుగురికి నాగార్జున ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆర్జే సూర్య హీరోల వాయిస్ ను ఇమిటేట్ చేసి తమన్నాను ఆకట్టుకున్నాడు. దాంతో ‘బిగ్ బాస్ కానుక’ను ఆర్జే సూర్యకు ఇస్తానని తమన్నా తెలిపింది. అలా ఆర్జే సూర్య సెకండ్ వీక్ కి గానూ గిఫ్ట్ హ్యాంపర్స్ అందుకున్నాడు.