Site icon NTV Telugu

Tamannaah : మరో పవర్‍ఫుల్ రోల్‌లో తమన్నా..

Thamannah

Thamannah

ఇటీవలి కాలంలో తమన్నా ఎంపిక చేస్తున్న పాత్రలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఓదెల రైల్వే స్టేషన్ 2లో శక్తివంతమైన పాత్రతో, అలాగే అజయ్ దేవగన్ నటించిన రైడ్ 2లో కీలక క్యారెక్టర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా ఓ బయోపిక్ ద్వారా మరో విభిన్నమైన, భావోద్వేగభరితమైన పాత్రలో కనిపించబోతుంది ఈ మిల్క్ బ్యూటీ.

Also Read : Nani: నాని నుండి మరో సర్ప్రైజ్..

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు వీ. శాంతారాం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ‘చిత్రపతి వీ. శాంతారాం’. యువ నటుడు సిద్ధాంత్ చతుర్వేది శాంతారాం పాత్రలో కనిపించనున్నాడు. నాటసామ్రాట్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అభిజిత్ దేశ్‌పాండే ఈ బయోపిక్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ బయోపిక్‌లో నటి తమన్నా ముఖ్య పాత్ర పోషించబోతున్నారు. ఈ సినిమాలో ఆమె, శాంతారాం గారి భార్య సాంధ్య పాత్రలో నటించనున్నట్టు సమాచారం. కథ విన్న వెంటనే తమన్నా కూడా ఈ పాత్రను అంగీకరించినట్లు సమాచారం. చిత్రబృందం ప్రస్తుతం షూటింగ్ ప్రారంభానికి సన్నాహాలు చేస్తోంది. వీ. శాంతారాం జీవితం, ఆయన చేసిన ప్రయోగాలు, భారతీయ సినిమాకి అందించిన సేవలను నిజమైన రూపంలో చూపించేందుకు ప్రత్యేకంగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రం విడుదలైన తర్వాత బాలీవుడ్‌లో మరో సక్సెస్‌ఫుల్ బయోపిక్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమలో ఇప్పటికే చర్చ మొదలైంది. తమన్నా ఈ పాత్రలో ఎలా మెరిసుతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version