Tamannaah Bhatia About Her Relationships: తన జీవితంలో రెండు బ్రేకప్స్ ఉన్నాయని స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా తెలిపారు. రిలేషన్‌షిప్‌లో అందరిలానే తాను కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొన్నానని చెప్పారు. టీనేజ్‌లో మొదటిసారి తాను ప్రేమలో పడ్డానని, కొన్ని కారణాలతో ఆ బంధం నిలవలేదని పేరొన్నారు. మిల్కీబ్యూటీ కొంతకాలంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. ‘లస్ట్ స్టోరీస్ 2’ షూటింగ్ సమయంలో ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు.
రాజ్ షమణితో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తమన్నా భాటియా తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ‘నా హార్ట్ రెండుసార్లు బ్రేక్ అయింది. అప్పుడు ఎంతో భాధను అనుభవించా. టీనేజ్‌లో ఉన్నప్పుడే నా హార్ట్ తొలిసారి బ్రేక్ అయింది. ఒక వ్యక్తి కోసం నచ్చిన జీవితాన్ని వదులుకోవడం నాకు అస్సలు నచ్చలేదు. జీవితంలో ఏదో సాధించాలనుకున్నా. అందుకు ప్రేమ అడ్డుకాకూడదు. అందుకే ఆ బంధం నిలవలేదు. ఆ తర్వాత మరో వ్యక్తితో కొంతకాలం రిలేషన్‌లో ఉన్నాను. అతను కూడా నాకు సెట్ కాడనిపించింది. ప్రతి చిన్న విషయానికి అబద్ధం చెప్పేవాళ్లంటే నాకు నచ్చదు. అలాంటి వ్యక్తితో రిలేషన్ ప్రమాదమని అర్థమైంది. అలా రెండోసారి బ్రేకప్ అయింది’ అని మిల్కీబ్యూటీ చెప్పారు.
Also Read: IND vs BAN: బీసీసీఐ కీలక నిర్ణయం.. ముంబై యువ స్పిన్నర్‌కు ఆహ్వానం!
తమన్నా గతంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో డేటింగ్ చేశారని నెట్టింట వార్తలు వచ్చాయి. అంతేకాదు తమిళ్ హీరో కార్తీతో కూడా రిలేషన్‌లో ఉన్నారని అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ప్రస్తుతం విజయ్ వర్మతో మిల్కీబ్యూటీ డేటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో తమ్మూ బిజీగా ఉన్నారు. ‘స్త్రీ 2’లో స్పెషల్ సాంగ్‌తో అలరించిన తమన్నా.. తెలుగులో ‘ఓదెల 2’లో నటిస్తున్నారు. మరోవైపు విజయ్ తాజాగా విడుదలైన ‘ఐసీ 814’లో నటించారు.