NTV Telugu Site icon

Tamanna Bhatia : రెడ్ శారీలో కిల్లింగ్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న తమన్నా..

Tamanna bhatia

Tamanna bhatia

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ ఫిలిం ఇండస్ట్రీ నుండి బాలీవుడ్ వరకు హీరోయిన్ గా సత్తా చాటింది.. సౌత్ సినీ ఇండస్ట్రీలో దాదాపు చాలామంది టాప్ మోస్ట్ హీరోలతో ఈ ముద్దుగుమ్మ నటించింది. నటనపరంగా, డాన్స్ పరంగా తమన్నా స్క్రీన్ చించేస్తది. చాలా సినిమాలు తమన్నా డ్యాన్స్ తోనే హిట్ అయ్యాయని ఫ్యాన్స్ అంటున్నారు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్.. ఇంకా చాలామంది హీరోలతో నటించింది.. ఇప్పటికి ఇండస్ట్రీలో తన హవాను కొనసాగిస్తుంది..

కొత్త హీరోయిన్ల ఎంట్రీ తో తమన్నాకు తెలుగు లో అవకాశాలు తగ్గాయి.. దాంతో సీనియర్ హీరోల సరసన నటిస్తుంది.. ఒకవైపు సినిమాలు చేస్తున్నా కూడా మరోవైపు సోషల్ మీడియా హాట్ ఫొటోలతో మంట పుట్టిస్తుంది.. తాజాగా జైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.. ఆ ఈవెంట్ కు రెడ్ శారీలో వచ్చింది. ఆ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.. ఈ ఈవెంట్ లో ట్రేండింగ్ సాంగ్ అయినా.. కావాలాయ్య సాంగ్ కు తమన్నా స్టేజి షో తో కుర్రాళ్లకు మత్తెక్కిచ్చే డ్యాన్స్ తో ఫిదా చేసింది. దీంతో మళ్ళీ తమన్నా ఫేమస్ అయింది. తన ఇన్‌స్టాగ్రామ్ లో ఆడియో లాంచ్ ఫొటోస్ షేర్ చేస్తూ.. కావాలా సాంగ్ కు నేను స్టేజి షో చేయడం ఎంతో హ్యాపీ.. ఈ సాంగ్ కు ఫిదా అయినా ఆడియన్స్ కు థాంక్స్. అలాగే ఆడియన్స్ లో ఒకరైన రజినీకాంత్ సార్ కు స్పెషల్ థాంక్స్ అంటూ.. తమన్నా పేర్కొన్నారు.

ఇక తమన్నా సినీ కెరీర్ విషయానికి వస్తే.. ఆమె ఇటీవల ఓ వెబ్ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. లస్ట్ స్టోరీస్ 2 అంటూ వచ్చిన ఈ వెబ్ సిరీస్‌ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.. ఆమె ఈ వెబ్ సిరీస్‌లో కీలకపాత్రలో కనిపించింది. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ కోసం ఆమె కాస్తా బోల్డ్‌గా కనిపించింది. అందులో భాగంగా కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది.. అలాగే ప్రస్తుతం చిరంజీవి సరసన ‘భోళా శంకర్‌’ సినిమాలో నటిస్తోంది. మెహెర్ రమేష్ దర్శకుడు.. దీంతో పాటు తమన్నా.. తమిళ్‌లో రజనీకాంత్ ‘జైలర్‌’లో నటిస్తోంది.. ఈ సినిమాలు త్వరలోనే ప్రేక్షకులకు ముందుకు రానున్నాయి..