Taliban vs America: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆఫ్ఘనిస్థాన్‌లోని బాగ్రామ్ వైమానిక స్థావరం గురించి ఇటీవల చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తుంది. అమెరికా అధ్యక్షుడి ప్రకటన తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో పెరిగాయి. ట్రంప్ తన ప్రకటనలో తాలిబన్లు బాగ్రామ్‌ను అప్పగించకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని స్పష్టంగా హెచ్చరించారు. ఈ ప్రకటన వెలువడిన అనంతరం ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ కార్యకలాపాలు వేగవంతం అయ్యాయి. బాగ్రామ్ విషయంలో ఒక వేళ అమెరికాతో యుద్ధానికి తాలిబన్లు యుద్ధానికి సిద్ధం అయితే పరిస్థితి ఎలా ఉంటుంది, ఇంతకీ తాలిబన్లకు ఉన్న బలం ఎంత? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Coolie : కూలీలో మంచి పాత్ర ఇవ్వలేదు.. లోకేష్ పై నటి షాకింగ్ కామెంట్స్
ట్రంప్ ప్రకటన తర్వాత జోరందుకున్న సమావేశాలు
కాందహార్‌లో తాలిబన్ అధినేత హెబ్తుల్లా అఖుండ్‌జాదా నిత్యం అగ్ర మంత్రులు, నిఘా అధిపతులు, సైనిక కమాండర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలలో కీలక అంశంగా బాగ్రామ్ వైమానిక స్థావరం ఉందని పలు నిఘా వర్గాలు చెబుతున్నాయి. పలు నివేదికల ప్రకారం.. ట్రంప్ కన్నెర్ర చేసిన తర్వాత కాందహార్‌లోని అఖుండ్‌జాదా నివాసం చుట్టూ పెద్ద సంఖ్యలో కమాండోలను మోహరించారు. ఈ సమావేశాల్లో తాలిబన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ బాగ్రామ్‌ను అగ్రరాజ్యానికి ఇవ్వడానికి ఒప్పుకోనట్లు సమాచారం.. ఒక వేళ అమెరికా బాగ్రామ్‌ను ఆక్రమించుకోడానికి ప్రయత్నిస్తే ప్రత్యక్ష పోరాటంలో పాల్గొనడానికి సిద్ధం కావడానికి నిర్ణయించినట్లు సమచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ విదేశీ ఒత్తిళ్లకు తలొగ్గబోమని తాలిబన్లు స్పష్టం చేశారు. గతంలో కంటే ఇప్పుడు కాందహార్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు.
ఇంతకీ తాలిబన్ల సైనిక బలం ఎంత?
ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ (IISS) వార్షిక నివేదిక ప్రకారం.. తాలిబాన్ల వద్ద ప్రస్తుతం దాదాపు 150,000 మంది క్రియాశీల యోధులను ఉన్నారు. తాజాగా ఈ సంఖ్యను మరో 50 వేలు పెంచుతామని తాలిబాన్ సైనిక అధిపతి పేర్కొన్నారు. అయితే ఈ విస్తరణకు ఎంత కాలం పడుతుందో ఆయన పేర్కొలేదు. దళాల సంఖ్య పరంగా.. US వద్ద 2.1 మిలియన్లకు పైగా సైనికులు, 13,398 సైనిక విమానాలు ఉన్నాయి. అలాగే USకు 6,287 ట్యాంకులు, 24 విమాన వాహక నౌకలు ఉన్నాయి. 2021లో ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా, అంతర్జాతీయ దళాల ఉపసంహరణ తర్వాత, తాలిబన్లు పెద్ద మొత్తంలో ఆయుధాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
తాలిబన్లు వద్ద ప్రస్తుతం మూడు తేలికపాటి విమానాలు, అమెరికన్ బ్లాక్ హాక్స్‌తో సహా 14 హెలికాప్టర్లు ఉన్నాయి. ఆఫ్ఘన్ నేషనల్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ (ANDSF) నుంచి కొన్ని రష్యన్ హెలికాప్టర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అమెరికా దళాలు ఆఫ్ఘనిస్థాన్‌ను విడిచిపెట్టినప్పుడు దాదాపు $7 బిలియన్ల విలువైన సైనిక పరికరాలను వదిలి వెళ్లినట్లు అంచనా. ఇందులో హైటెక్ ఆయుధాలు, అధునాతన వ్యవస్థలు కూడా ఉన్నాయి. అయితే ఈ పరికరాలను ఆపరేట్ చేయగల నైపుణ్యం ఉన్న సైనిక శక్తి తాలిబన్ల వద్ద పరిమితం అని రక్షణ నిపుణులు భావిస్తున్నారు.
ఉద్రిక్తతలకు దారి తీసిన ట్రంప్ ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటన తాలిబన్లకు ఆగ్రం తెప్పించింది. బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని అమెరికా తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటుందని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. బాగ్రామ్ ఒకప్పుడు అమెరికన్ శక్తికి చిహ్నంగా ఉండేది. కానీ తాలిబన్లకు ఈ వైమానిక స్థావరం కేవలం సైనిక స్థావరం మాత్రమే కాదు, ప్రతీకాత్మక విజయం. కాబట్టి వాళ్లు దానిని తిరిగి అమెరికాకు అప్పగించడం అంటే లొంగిపోవడం అని, అది ఓటమి మాత్రమే కాదని, తాలిబన్ ప్రభుత్వ విశ్వసనీయతను కూడా కోల్పోతుందని భావిస్తున్నారు. తాలిబన్ల వద్ద సైన్యం, ఆయుధాలు ఉన్నప్పటికి వారికి సరైన శిక్షణ లేకపోవడం ప్రధానమైన మైనస్. పొరపాటున యుద్ధం జరుగుతునే ఈ అంశం అమెరికాకు అదనపు బలంగా మారనుంది.
READ ALSO: Indo-Nepal: నేపాల్ సైన్యంలో ‘మేడ్ ఇన్ ఇండియా’ ముద్ర.. భారత్‌తో మామూలుగా ఉండదు
