Muslim Ccountry Bans Hijab: ప్రపంచంలోని ఇస్లామిక్ దేశాల్లో బుర్ఖా, హిజాబ్ ధరించడం అనేది తప్పని సరి. కానీ ఒక ముస్లిం దేశం మాత్రం బుర్ఖా, హిజాబ్‌లపై నిషేధం విధించింది. తాజాగా ఇటలీలో బుర్ఖాను నిషేధించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బిల్లు అమలులోకి వచ్చిన తర్వాత, దేశంలో బుర్ఖా ధరించడం నిషేధిస్తారు. దేశంలోని బహిరంగ ప్రదేశాలలో బుర్ఖా, హిజాబ్ ధరించడం కొనసాగించే వారికి ₹300,000 జరిమానా విధించనున్నట్లు ఇటలీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వెలువడిన అనంతరం బుర్ఖా, నిఖాబ్, హిజాబ్‌లపై నిషేధం విధించిందిన ముస్లిం దేశంపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. ఇంతకీ ఆ దేశం ఏంటి, ఎందుకు ఆ దేశంలో వాటిని నిషేధించారు..
READ ALSO: Rare-earth minerals: అమెరికాకు ఇవ్వమని హామీ ఇవ్వండి.. ‘‘రేర్-ఎర్త్’’పై భారత్‌ను కోరిన చైనా..
ఏ దేశంలో నిషేధం విధించారో తెలుసా?
ముస్లిం దేశం అయిన తజికిస్థాన్‌లో 2024లో ప్రభుత్వం అధికారికంగా హిజాబ్ ధరించడాన్ని నిషేధించింది. అక్కడి ప్రభుత్వం హిజాబ్‌ను విదేశీ వస్త్రంగా పరిగణించిన నేపథ్యంలో ఈ నిషేధం విధించినట్లు పేర్కొంది. దేశ జనాభాలో దాదాపు 90 శాతం మంది ముస్లింలు ఉన్నప్పటికీ, హిజాబ్ అనేది తజికిస్థాన్ సంస్కృతిలో భాగం కాదని అధ్యక్షుడు రెహమాన్ పేర్కొన్నారు. అందువల్ల దేశంలో దానిని నిషేధించినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం ప్రస్తుతం దేశంలో ఉన్న చట్టం “ఆన్ ది రెగ్యులేషన్ ఆఫ్ హాలిడేస్ అండ్ సెరిమోనీస్” ను భర్తీ చేసింది. అలాగే జాతీయ సంస్కృతికి విరుద్ధమైనదిగా భావించే అన్ని దుస్తులను దిగుమతి చేసుకోవడం, అమ్మడం, ప్రచారం చేయడం, ధరించడాన్ని పూర్తిగా నిషేధించింది.
చట్టాన్ని ఉల్లంఘిస్తే జరిమానా తప్పదు..
తజికిస్థాన్‌లో అమలులోకి తీసుకొచ్చిన ఈ చట్టం హిజాబ్, బుర్ఖా, నిఖాబ్ వంటి ఇతర ఇస్లామిక్ దుస్తులను ధరించకూడదని పేర్కొంది. ఉల్లంఘించిన వారికి 7,920 సోమోని (సుమారు $747) నుంచి 39,500 సోమోని (సుమారు $3,724) వరకు జరిమానాలు విధిస్తారు. తజిక్ సంస్కృతిని ప్రోత్సహించడానికి, బహిరంగంగా మతం ప్రదర్శనలను తగ్గించడానికి అధ్యక్షుడు రెహమాన్ తీసుకున్న అనేక చర్యలలో హిజాబ్ నిషేధం ఒకటిగా విశ్లేషకులు పేర్కొన్నారు.
అక్కడి ప్రభుత్వం 2018లో మహిళలకు ఆమోదయోగ్యమైన దుస్తులను వివరిస్తూ 376 పేజీల గైడ్‌బుక్‌ను జారీ చేసింది. మహిళలు సాంప్రదాయకంగా తల వెనుక రంగురంగుల స్కార్ఫ్‌లు కట్టుకోవడం ఆమోదయోగ్యమైనది, కానీ ముఖం, మెడను కప్పి ఉంచడం దేశంలో నిషేధించారు. నల్లటి దుస్తులు కూడా నిషేధించబడ్డాయి. అంత్యక్రియలకు హాజరయ్యే వారికి నీలిరంగు దుస్తులు, తెల్లటి స్కార్ఫ్‌లు సిఫార్సు చేశారు.
READ ALSO: Dhan Dhanya Yojana: రైతులకు మోడీ కానుక.. రూ.24 వేల కోట్ల ధన్ ధన్య పథకాన్ని ప్రారంభించిన ప్రధాని..
