Site icon NTV Telugu

Duddilla Sridhar Babu : అంబర్ – రెసోజెట్ పెట్టుబడులు రూ.250 కోట్లు.. వెయ్యి మందికి ఉద్యోగాలు

Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu : పలు దిగ్గజ కంపెనీలకు ఎలక్ట్రానిక్ వినిమయ వస్తువులు, విడిభాగాలు అందించే ‘అంబర్ – రెసోజెట్ భాగస్వామ్య సంస్థ రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడులతో ఉత్పాదన ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. సోమవారం నాడు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో సంస్థ ప్రతినిధులు తమ పెట్టుబడుల ప్రణాళికను వెల్లడించారు. అంబర్ – రెసోజెట్ సంస్థకు ప్రభుత్వ పరంగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఈ సందర్భంగా శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ సంస్థ దేశంలోని పలు కంపెనీల కోసం రూమ్ ఏసీలు, అత్యాధునిక వాషింగ్ మెషీన్లు, డిష్ వాషర్లు, పారిశ్రామిక ఎయిర్ కండిషనర్ల లాంటి పలు పరికరాలకు ఉత్పత్తి చేసి అందిస్తోందని ఆయన తెలిపారు. వచ్చే మూడేళ్లలో రూ.250 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు నెలకొల్పుతుందని శ్రీధర్ బాబు చెప్పారు.

CRDA: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి భూములిచ్చిన రైతులకు గుడ్‌న్యూస్‌..

దీని వల్ల ప్రత్యక్షంగా వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. త్వరలోనే అత్యాధునిక ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు(పిసిబి) ల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని శ్రీధర్ బాబు వెల్లడించారు. వందేభారత్ రైళ్లు, మెట్రో రైళ్ల ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలతో పాటు, బస్సులు, డిఫెన్స్ వాహనాలు, పారిశ్రామిక అవసరాలకు ఎయిర్ కండిషనర్ల తయారీలో అంబర్ ఎంటర్ ప్రైజెస్ కు మంచి పేరుందని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ఉత్పత్తి యూనిట్లు ఉన్న అంబర్ తాజాగా హైదరాబాద్ ను గమ్యస్థానంగా ఎంచుకున్నందుకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, టీజీఐఐసీ ఎండీ డా. ఇ. విష్ణువర్ధన్ రెడ్డి, సిఇఓ మధుసూదన్, డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ డా. ఎస్ కె శర్మ, అంబర్, రెసోజెట్ ప్రతినిధులు పాల్గొన్నారు.

VD : విజయ్ దేవరకొండ ‘రౌడీ వేర్’ బ్రాండ్ కు స్పెషల్ అవార్డ్

Exit mobile version