Traffic Advisory : ఏప్రిల్ 12వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ శోభాయాత్ర గౌలిగూడలోని శ్రీ రామమందిరం వద్ద ఉదయం 11 గంటలకు ప్రారంభమై, నగరంలోని పలు కీలక ప్రాంతాల గుండా సాగుతూ తాడ్‌బండ్‌లోని శ్రీ హనుమాన్ మందిరం వద్ద ముగుస్తుంది. శోభాయాత్ర మార్గం పుత్లిబౌలి క్రాస్ రోడ్స్, ఆంధ్రా బ్యాంక్ క్రాస్ రోడ్స్, కోఠి, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్స్, రామ్‌కోఠి క్రాస్ రోడ్స్, కాచిగూడ క్రాస్ రోడ్స్, నారాయణగూడ వైఎంసీఏ, చిక్కడపల్లి క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, గాంధీ నగర్ బ్యాక్ సైడ్ వైశ్రాయ్ హోటల్, ప్రాగా టూల్స్, కవాడిగూడ, సీజీవో టవర్స్, బన్సీలాల్‌పేట రోడ్, బైబిల్ హౌస్, సిటీ లైట్ హోటల్, బాటా షోరూమ్, ఉజ్జయిని మహంకాళి టెంపుల్, ఓల్డ్ రామ్‌గోపాల్‌పేట రోడ్, పారడైజ్ క్రాస్ రోడ్స్, సీటీవో జంక్షన్, లీ రాయల్ ప్యాలెస్, బ్రూక్ బాండ్, ఇంపిరీయల్ గార్డెన్, మస్తాన్ కేఫ్ మీదుగా సాగుతూ తాడ్‌బండ్‌లోని హనుమాన్ టెంపుల్‌కు చేరుకుంటుంది.
ఈ శోభాయాత్ర సజావుగా సాగేందుకు పోలీసు శాఖ శనివారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. ఈ రహదారులపై ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా లక్డీకాపూల్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్, ఉప్పల్ వైపు వెళ్లే వాహనదారులు వీవీ స్టాచ్యూ, సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్ ఫ్లై ఓవర్, ప్రకాశ్ నగర్ ఫ్లై ఓవర్, పారడైజ్ ఫ్లై ఓవర్ మీదుగా సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకోవాలని సలహా ఇచ్చారు. ఈ శోభాయాత్రలో భక్తుల భద్రత , ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసు శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది, కాబట్టి నగరవాసులు ఈ ఆంక్షలకు సహకరించి, హనుమాన్ జయంతి వేడుకలు సాంతం సజావుగా జరిగేలా తోడ్పడాలని అధికారులు కోరుతున్నారు.
Tariffs War: ట్రంప్ ఎఫెక్ట్.. ఇండియా తర్వాత, ఈయూ సాయం కోరిన చైనా..