NTV Telugu Site icon

Kethireddy Pedda Reddy: 2024 ఎలక్షన్ తర్వాత మళ్ళీ పాత పెద్దారెడ్డిని చూస్తారు

Peddareddy

Peddareddy

తాడిపత్రి ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి తన రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. కరపత్రాలు పంచడం అంటే రాజకీయంగా దిగజారాడమేనని ఎమ్మెల్యే అన్నారు. నేను వ్యాపారాలు చేసి భూములు కొన్నాము.. గతంలో జేసీ దివాకర్ రెడ్డి గెలుపు కోసం మీకు మేము చెందాలు ఇచ్చాము.. గతంలో మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నారో జేసీ కుటుంబ గుర్తించుకోవాలి అని ఆయన చెప్పారు. జేసీ ప్రభాకర్ రెడ్డి విద్యుత్ స్తంభాలకు ఉన్న వైసీపీ జెండాలు తీసివేయమని లెటర్ ఇచ్చాడు.. నేను కష్టపడి ఆస్తులు కొన్నాను.. జేసీ ప్రభాకర్ రెడ్డి కష్టపడి ఆస్తులు కొన్నాను అని చర్చకు రావాలి.. మున్సిపాలిటీలో జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో రూములు ఇప్పించి వాటి పల్లన వచ్చే అధిక బడుగలతో జేసీ కుటుంబ నడుస్తుంది.. నేను ఇప్పుడు ఫ్యాక్షన్ జోలికి వేళ్ళను అని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు.

Read Also: Andhra Pradesh: గుడివాడలో ఉద్రిక్తత.. పోలీసులకు అంగన్వాడీలకు మధ్య వాగ్వాదం

2024 ఎలక్షన్ తర్వాత మళ్ళీ పాత పెద్దారెడ్డిని చూస్తారు మళ్ళీ ఫ్యాక్షన్ చేస్తాను అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి చెప్పారు. కొందరు నాపై సోషల్ మీడియాతో ఏదో మాట్లాడుతున్నాడు వాళ్ళకి 2024 ఎలక్షన్ తర్వాత చూపిస్తా.. గతంలో జేసీ కుటుంబం లారీలకు టైర్లు వేరే వల్ల దగ్గర అరిగి పోయిన టైర్లు తీసుకొని బతికేవారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరించే కాలాలు పోయాయి.. 2024లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ఫ్యాక్షన్ మొదలు పెడుతా.. పంటకు పురుగు ఎలా నష్టమో, రాజకీయాలలో కూడా అలాంటి వారిని వెరీ పారేస్తానంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెల్లడించారు.