తాప్సి పన్ను.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ ఝుమ్మంది నాదం సినిమా తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది.ఈ సినిమాలో మంచు మనోజ్ సరసన తాప్సీ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించారు..ఈ సినిమాతో మంచి విజయం అందుకున్న ఈ భామ ఈమె పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.అయితే ఈమెకు తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది . ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న తాప్సి కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల ద్వారా కూడా ప్రేక్షకులను మెప్పించింది..ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాణ రంగంలో కూడా అడుగు పెట్టింది. అలాగే ఈమె వరస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈమె ఈ మధ్యకాలంలో పలు వివాదాల ద్వారా కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో తాప్సీ సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటుంది.ఈమె సోషల్ మీడియాకు దూరం కావడానికి గల కారణాలను కూడా తాజాగా వెల్లడించారు.చాలా రోజుల తర్వాత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఈమెకు పలు ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ఇన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండడానికి కారణం ఏంటి అంటూ కొందరు నేటిజన్స్ ప్రశ్నించారు. ఈ భామ సమాధానం ఇస్తూ..నాకు ఒక్క క్షణం కూడా తీరిక లేదని వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉండటం వల్లే తాను సోషల్ మీడియాకు దూరమయ్యాను అంటూ తెలిపింది.. ప్రస్తుతం ఈమె షారుక్ ఖాన్ తో కలిసి డంకీ సినిమాలో నటిస్తుంది.. అయితే ఇలా షారుఖ్ ఖాన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది. ఆయనతో కలిసి నటించడం వల్ల ఎన్నో విషయాలను నేర్చుకుంటున్నాను అంటూ తాప్సీ తెలిపింది. ప్రస్తుతం ఈ భామ చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి.