టీ20 ప్రపంచకప్ 2026కు భారత్, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యమివ్వనున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో మెగా టోర్నీ జరగనుంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) ఇప్పటికే పంపినట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ మ్యాచ్‌లు అన్నీ ఎంపిక చేసిన 5 నగరాల్లో జరగనున్నాయి. ఫైనల్ మాత్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Dil Raju: ప్రెస్‌మీట్స్ పెట్టడం, ట్రైలర్స్ లాంఛ్ చేయడం గొప్పకాదు.. అసలైన టాస్క్ అదే!
పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ టీమ్ తన మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడనుంది. ఆసియా కప్ 2025 పాకిస్థాన్‌లో జరగగా.. భారత్ తన మ్యాచ్‌లను యూఏఈలో ఆడింది. ఇటీవల ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో పాక్ తన మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడింది. భారత్, పాక్ మధ్య ఒప్పందం ప్రకారం తటస్థ వేదికలపై మ్యాచ్‌లను ఆడుతున్నాయి. ఒకవేళ పాక్ ఫైనల్‌కు వస్తే మాత్రం తుది పోరు అహ్మదాబాద్‌లో కాకుండా శ్రీలంకలో జరగనుంది. త్వరలోనే ఐసీసీ షెడ్యూల్ ప్రకటించనుంది.
