పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గత ఏడాది సలార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డార్లింగ్ ఆ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.. ఇక ఇప్పుడు వరుస ఫ్యాన్ ఇండియా సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు… ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. ఈ ఇటీవల రిలీజ్ అయిన అమితాబ్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. తాజాగా కల్కి లుక్ తో క్రికెట్ వరల్డ్ స్పెషల్ వీడియోను క్రియేట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఈ సినిమాను డిఫరెంట్ కథతో తెరకెక్కిస్తున్నారు.. టీజర్ ను చూస్తే అర్థమవుతుంది.. ఇందులో సైన్స్, పురాణాలు కలిపి చూపించబోతున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరోవైపు డైరెక్టర్ నాగ్ అశ్విన్ఈ సినిమా గురించి వివరిస్తూ ఊరిస్తున్నాడు.. దాంతో సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి.. సినిమా విడుదలకు ముందే ఫ్యాన్స్ హంగామా మొదలైంది.. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా జూన్ 27 న విడుదల చెయ్యనున్నారు..
కల్కి మేకర్స్ ప్రమోషన్స్ గట్టిగానే ఇస్తున్నారు.. ఏ ట్రెండింగ్ అంశాన్ని అస్సలు వదల్లేదు. ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్ లో ప్రభాస్ చేత ఎంట్రీ ఇప్పించారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇప్పుడు మరో వీడియోను వదిలారు.. అమితాబ్ లుక్ తో టీ20 కి టీమ్ ఇండియాకు సపోర్ట్ చేసేలా విషెష్ చెప్పించారు.. యుద్ధం రోజు ఉంటుంది.. కానీ మహా యుద్ధంలో గెలవడమే అసలైన పరీక్ష అని అమితాబ్ చెప్పాడు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..