Site icon NTV Telugu

Syria: సిరియాలో ఎన్నికలు లేకుండా కొత్త ప్రభుత్వం కొలువుదీరనుందా..!

Syria New Government

Syria New Government

Syria: సిరియాలో అస్సాద్ పాలనను అల్-షారా కూలదోసి దాదాపు ఏడాది అయింది. గడిచిన ఏడాదిగా సిరియాలో అల్-షారా ఆధ్వర్యంలోని తాత్కాలిక ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలు నిర్వహించలేదు. తాజా సమాచారం ఏమిటంటే.. అక్టోబర్ 5న దేశంలో మంత్రివర్గం కోసం ఎంపిక ప్రక్రియ జరుగుతుందని ఎన్నికల కమిషన్ ఆదివారం ప్రకటించింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలు లేకుండానే జరుగుతున్నాయని తెలిపింది. ఇంతకీ ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు ప్రత్యక్షంగా ఎలా పాల్గొంటారనే దానిపై ఎన్నికల కమిషన్‌కు స్పష్టత ఇవ్వలేదు.

READ ALSO: GST 2.0 : కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి.. వ్యాపారాలు, వినియోగదారులపై ప్రభావం

ఏడాది క్రితం సిరియా పీపుల్స్ అసెంబ్లీని రద్దు చేశారు. తాజాగా దేశంలో సాధారణ ఎన్నికల ప్రకటన లేకుండానే, కొత్త మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన విడుదల అయ్యింది. ఈ కొత్త మంత్రివర్గం రాబోయే ఐదు ఏళ్లు దేశాన్ని పరిపాలించనున్నట్లు సమాచారం. ఈ కొత్త మంత్రివర్గానికి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించబోమని ఆ దేశ ఎన్నికల కమిషన్ పేర్కొంది. కొత్త మంత్రి వర్గాన్ని ఎంపిక చేయడంలో 210 మంది ఎంపీలు పాల్గొంటారని తెలిపింది. వీరిలో 140 మందిని ఎన్నికల కమిషన్ పర్యవేక్షించే స్థానిక కమిటీలు నామినేట్ చేస్తాయని, మిగిలిన 70 మందిని అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా నేరుగా ఎంపిక చేస్తారని వెల్లడించింది. సిరియా ఎన్నికల కమిషన్ తన అధికారిక టెలిగ్రామ్ ఛానెల్‌లో అక్టోబర్ 5న సిరియా ప్రావిన్సులలోని ఎన్నికల జిల్లాల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని పేర్కొంది. అయితే సిరియాలోని అన్ని ప్రావిన్సులు ఈ ప్రక్రియలో పాల్గొంటాయో లేదో అనేది మాత్రం కమిషన్ స్పష్టం చేయలేదు.

ఈ ప్రాంతాల్లో ఎన్నికలు లేవు..
సిరియాలోని డ్రూజ్ – మెజారిటీ స్వీడా ప్రావిన్స్, కుర్దిష్ నియంత్రణలో ఉన్న రక్కా, హసకే ప్రాంతాలలో భద్రతా, రాజకీయ పరిస్థితుల కారణంగా ఎన్నికలు ఆలస్యం అవుతాయని ఆ దేశ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. జూలైలో స్వీడాలో ఘర్షణలు ప్రాణాంతకంగా మారిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఇజ్రాయెల్ జోక్యం చేసుకుని సిరియాలో వైమానిక దాడులు చేసింది. మార్చిలో ఆమోదించిన సిరియా రాజ్యాంగ ప్రకటన ప్రకారం.. ఈ కొత్త పార్లమెంటు 30 నెలల పాటు దేశంలో అధికారంలో ఉండనుంది. శాశ్వత రాజ్యాంగం ఆమోదంపొంది దేశంలో ఎన్నికలు జరిగే వరకు ఈ ప్రభుత్వం పనిచేయనుంది.

READ ALSO: Dussehra Celebrations : ఇంద్రకీలాద్రిపై దసరా సంబరాలు, భక్తుల సందడి, భారీ బందోబస్త్ మధ్య వేడుకలు

Exit mobile version