Site icon NTV Telugu

Swiss Indian Sports League: విజయవంతంగా ముగిసిన స్విస్ ఇండియన్ స్పోర్ట్స్ లీగ్.. ఛాంపియన్‌ ‘వరంగల్ వారియర్స్’!

Swiss Indian Sports League 2025

Swiss Indian Sports League 2025

2025 ‘సంక్రాంతి’ పర్వదినం పురస్కరించుకొని ప్రారంబమైన ‘స్విస్ ఇండియన్ స్పోర్ట్స్ లీగ్’ ఫిబ్రవరి 15తో ముగిసింది. ప్రారంభ సీజన్‌లో ‘వరంగల్ వారియర్స్’ టీమ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో వరంగల్ వారియర్స్ 6 పరుగుల తేడాతో కాకతీయ నైట్ రైడర్స్‌పై గెలుపొందింది. ఇటీవల దావోస్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్రీడాకారుల సమక్షంలో ట్రోఫీని ప్రదర్శించారు.

వరంగల్ వారియర్స్ నిలకడగా ఆడి 5 లీగ్ గేమ్‌లలో 4 గెలిచి.. లీగ్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. హైదరాబాద్ హిట్టర్స్ రెండో స్థానంలో నిలవగా, కాకతీయ నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన మూడో జట్టుగా నిలిచింది. టోర్నమెంట్‌లో ఆల్‌రౌండర్‌ ప్రదర్శనకు గాను పేర్ని రవితేజకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌’ అవార్డు దక్కింది. సంక్రాంతి సందర్భంగా స్విస్ తెలుగు ఎన్‌ఆర్ఐ ఫోరమ్ తొలిసారిగా స్విట్జర్లాండ్‌లో ఫ్రాంచైజీ ఆధారిత క్రికెట్ లీగ్‌ను ప్రారంభించింది. ప్రారంభ ఎడిషన్‌లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ప్రదేశాలు మరియు ప్రాంతాల పేర్లతో 6 బృందాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలతో గుర్తింపు పొందిన వ్యక్తులతో, భారతదేశంలోని మూలాలను కనెక్ట్ చేస్తూ ఆరోగ్యకరమైన, పోటీతత్వ క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడం లీగ్ యొక్క భావన.

ప్రారంభ ఎడిషన్ 2025 జనవరి 12 తేదీన ఇండోర్ గ్రౌండ్‌లో జరిగింది. మ్యాచ్‌లు నాణ్యమైన, గొప్ప స్ఫూర్తితో జరిగాయి. గత కొన్ని వారాలుగా జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి. ప్రాక్టీస్ కారణంగా ప్లేయర్స్ మైదానంలో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచారు. నూతన ఆలోచనలు, ప్రయత్నాలు, ఆర్థిక సహాయంతో మాకు మద్దతు ఇచ్చిన బృందాలు మరియు భాగస్వాములను స్వంతం చేసుకోవడానికి ముందుకు వచ్చిన కమ్యూనిటీ సభ్యులందరికీ ఈ సందర్భంగా స్విస్ ఇండియన్ స్పోర్ట్స్ లీగ్ ధన్యవాదాలు తెలియజేసింది. సరైన స్ఫూర్తితో ఆడే ఉత్తేజకరమైన మరియు పోటీతత్వ క్రీడా ప్రయాణానికి ఇది ప్రారంభం మాత్రమేనని ఇండియన్ స్పోర్ట్స్ లీగ్ ప్రతినిధులు పేర్కొన్నారు.

ప్రారంభ ఎడిషన్‌లో పాల్గొనే 6 జట్లు ఏంటో చూద్దాం.
1. శ్రీనివాస్ గొడుగునూరి మరియు విద్యాధర్ టేకేటికి చెందిన అమరావతి టైటాన్స్
2. రామకృష్ణ పాలిక యాజమాన్యం గోదావరి సూపర్ కింగ్స్
3. బాలాజీ కింతడ మరియు రామకృష్ణ ప్రయాగ యాజమాన్యంలోని హైదరాబాద్ హిట్టర్స్
4. శేషు మామిళ్లపల్లి మరియు శ్రీనివాస్ కొత్తపల్లికి చెందిన కాకతీయ నైట్ రైడర్స్
5. ప్రసాద్ బాబు మరియు అమర్ కవికి చెందిన వైజాగ్ వైకింగ్స్
6. కిషోర్ తాటికొండ మరియు శ్రీధర్ గండె యాజమాన్యంకు చెందిన వరంగల్ వారియర్స్

Exit mobile version