NTV Telugu Site icon

Swara Bhasker Baby: తల్లైన బాలీవుడ్‌ నటి.. మార్చిలో పెళ్లి, ఇటీవలే సీమంతం!

Swara Bhasker

Swara Bhasker

Swara Bhasker and Fahad Ahmad become parents: బాలీవుడ్ వివాస్పద నటి స్వర భాస్కర్ తల్లయ్యారు. స్వర, సమాజ్‌వాదీ పార్టీ నేత ఫహద్ అహ్మద్‌ జంట పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని స్వర, ఆమె భర్త ఫహద్‌ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. సెప్టెంబర్ 23న కూతురు పుట్టిందని వారు పేర్కొన్నారు. కూతురితో దిగిన పోటోలను స్వర తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. తమ కూతురికి ‘రుబియా’ అనే పేరు పెడుతున్నట్లు స్వర, ఫహద్ జంట తెలిపారు.

Also Read: Crime News: అత్యాచారం చేసి, కళ్లు పీకి.. యువతి దారుణ హత్య!

2021లో స్వర భాస్కర్‌, ఫహద్‌ అహ్మద్‌ ఓ కార్యక్రమంలో మొదటిసారి కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 2023 జనవరి 6న ఇద్దరు రహస్యంగా రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. ఈ విషయాన్ని ఫిబ్రవరి 16న సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక మార్చిలో సాంప్రదాయ పద్ధతిలో కుటుంబసభ్యుల మధ్య స్వర, ఫహద్ మరోసారి వివాహం చేసుకున్నారు. తాను ప్రెగ్నెంట్ అని స్వర జూన్‌లో ప్రకటించారు. సెప్టెంబర్ 23న పండంటి ఆడ బిడ్డకు స్వర, ఫహద్ దంపతులు జన్మనిచ్చారు. విషయం తెలిసిన అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Show comments