Site icon NTV Telugu

Kar Sevaks: రాజ్యాంగాన్ని పరిరక్షించే క్రమంలో కాల్పులు సబబే.. ఎస్పీ నేత హాట్ కామెంట్స్

Swamy

Swamy

ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని, చట్టాన్ని రక్షించేందుకు అరాచకవాదులను కాల్చి చంపాలనే ఉద్దేశంలో అప్పటి ప్రభుత్వం కరసేవకులపై కాల్పులకు ఆదేశాలు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. అయోధ్యలో మసీదు కూల్చివేత సంఘటన జరిగినప్పుడు న్యాయ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థలను పట్టించుకోకుండా అరాచకవాదులు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించారని స్వామి ప్రసాద్ మౌర్య ఆరోపణలు గుప్పించారు. అప్పటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షించేందుకు, శాంతిని కాపాడేందుకు కాల్పులు జరిపిందని ఆయన చెప్పుకొచ్చారు.

Read Also: AP High Court: చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై నేడు హైకోర్టు తీర్పు

ఇక, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై స్వామి ప్రసాద్ మౌర్య తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యను ప్రైవేటీకరించారు, నిరుద్యోగం పెరుగుతోంది, ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది.. కానీ, రామ మందిరం ద్వారా ప్రభుత్వం ప్రజల దృష్టిని వాస్తవ సమస్యల నుంచి దారి మళ్లిస్తోందని ఆరోపించారు. ప్రజలకు రాజ్యాంగం సమాన స్వేచ్ఛను ఇచ్చింది.. రాజ్యాంగం ప్రకారం అంటరానితనం, వివక్ష అనే భావాన్ని సమాజం నుంచి తొలగించాలి.. స్త్రీ విద్య పట్ల కూడా సమాజం శ్రద్ధ వహించాలి.. స్త్రీ విద్య లేకుండా ఏ సమాజం, దేశం పురోగమించదు అని ఆయన చెప్పుకొచ్చారు. నేటి కేంద్ర ప్రభుత్వం బహుజనులకు మేలు చేయని విద్యను వ్యాపార మయం చేస్తోంది అని స్వామి ప్రసాద్ మౌర్య విమర్శలు గుప్పించారు.

Exit mobile version