Site icon NTV Telugu

Suzuki Access: కొత్త లుక్‌లో సుజుకి యాక్సెస్ విడుదల.. ధర ఎంతంటే?

Suzuki

Suzuki

సుజుకి మోటార్‌సైకిల్ తన అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్, కొత్త సుజుకి యాక్సెస్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త యాక్సెస్ పేరు సుజుకి యాక్సెస్ రైడ్ కనెక్ట్ TFT ఎడిషన్. ఇందులో అనేక కొత్త ఫీచర్లను చేర్చడంతో పాటు, లుక్‌లో కూడా స్వల్ప మార్పులు చేశారు. సుజుకి రైడ్ కనెక్ట్‌తో కూడిన పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో 4.2-అంగుళాల కలర్ థిన్-ఫిల్మ్ ట్రాన్సిస్టర్ (TFT) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది రైడర్‌కు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. దీనిలో బ్లూటూత్ కనెక్టివిటీ అందించారు. దీని డిస్ప్లే పగలు లేదా రాత్రి అనే తేడా లేకుండా ప్రతి సందర్భంలోనూ సమాచారం సులభంగా కనిపించే విధంగా రూపొందించారు. డిస్ప్లే రైడర్‌కు వేగం, ఇంధనం, నావిగేషన్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది.

Also Read:Viral : తాత రాక్.. మనవడు షాక్..! నెటిజన్లను మెస్మరైజ్ చేసిన తాతయ్య

ఇంజిన్

సుజుకి యాక్సెస్ రైడ్ కనెక్ట్ TFT ఎడిషన్ 124 cc ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ తో వస్తుంది. ఇది 8.42 PS శక్తిని, 10.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సుజుకి యాక్సెస్ రైడ్ కనెక్ట్ TFT ఎడిషన్ పూర్తిగా కొత్త కలర్ స్కీమ్ లో ప్రారంభించారు. దీనికి కొత్త పెర్ల్ మ్యాట్ ఆక్వా సిల్వర్‌ను తీసుకువచ్చారు. మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇది చాలా స్టైలిష్‌గా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది మాట్టే బ్లాక్, స్టెల్లార్ బ్లూ, గ్రేస్ వైట్, ఐస్ గ్రీన్ వంటి పాత రంగులలో కూడా అందించబడుతుంది. ఈ స్కూటర్ మునుపటిలాగే అధిక వేగం, మంచి మైలేజ్, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని అందించేలా రూపొందించారు.

Also Read:Gold Rates: గోల్డ్ లవర్స్ కు బిగ్ రిలీఫ్.. నేటి బంగారం ధరలు ఇవే

ధర

సుజుకి యాక్సెస్ రైడ్ కనెక్ట్ TFT ఎడిషన్ భారత్ లో రూ. 1,01,900 ఎక్స్-షోరూమ్ ధరకు ప్రారంభించబడింది. ఈ స్కూటర్ భారతదేశం అంతటా ఉన్న సుజుకి మోటార్‌సైకిల్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.

Exit mobile version