Site icon NTV Telugu

Hyderabad: అల్వాల్ లో వృద్ధ దంపతుల అనుమానాస్పద మృతి..

Alwal

Alwal

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మృతి చెందిన దంపతులు కనకయ్య,రాజమ్మ గా పోలీసులు గుర్తించారు. కనకయ్య వాచ్మెన్ గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. మృతులు భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఒంటిపై గాయాలు ఉండడంతో పోలీసులు హత్యగా భావిస్తున్నారు.

Also Read:SridharBabu : దిల్ రాజు ‘లోర్వెన్ AI’ స్టూడియో నెక్ట్స్ లెవల్ కెళ్లాలి : సినిమాటోగ్రఫీ మంత్రి

కర్రలతో కొట్టి హతమార్చిన ఆనవాళ్లు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. దుండగులు ఇంట్లో మహిళ ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, లక్ష నగదు చోరీ చేసినట్లు బంధువులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ & డాగ్ స్క్వాడ్ టీమ్స్ ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యా్ప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

Exit mobile version