Site icon NTV Telugu

AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ.. ఘనంగా వీడ్కోలు.. ఆసక్తికర వ్యాఖ్యలు..

Ab Venkateswara Rao

Ab Venkateswara Rao

AB Venkateswara Rao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఈ రోజు పదవీ విరమణ చేశారు.. ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను ఇటీవల కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) తొలగించిన విషయం తెలిసిందే కాగా… ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే, క్యాట్‌ ఆదేశాల నిలుపుదలకు నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు గురువారం ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులను సీఎస్‌ జవహర్‌రెడ్డికి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలోనూ ఏబీ వెంకటేశ్వరరావు అందజేశారు. దీంతో.. ఎట్టకేలకు ఆయన్ను సర్వీసులోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ, స్టోర్స్‌ పర్చేజ్‌ కమిషనర్‌ ఆయనకు పోస్టింగ్‌ ఇచ్చింది. అయితే, ప్రింటింగ్ అండ్‌ స్టేషనరీ డీజీ హోదా ఏబీ వెంకటేశ్వరరావు ఈ రోజు పదవీ విరమణ చేశారు. ఏబీవీకి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా వీడ్కోలు పలికారు అభిమానులు.

Read Also: Islam Critic Attacked: ఇస్లాం విమర్శకుడుపై కత్తితో దాడి.. వీడియో వైరల్..

ఇక, ఈ సందర్భంగా ఏబీ‌ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. నేను ఇంజినీరింగ్ చదువుకుని తొలుత టాటామోటార్స్ లో ఉద్యోగం చేశానని గుర్తుచేసుకున్నారు.. అదే సంస్థలో ఉన్నా లేక అమెరికా వెళ్లిఉన్నా ఇప్పుడు నా జీవితం వేరే విధంగా ఉండేదన్న ఆయన.. దుష్ట శిక్షణ -శిష్టరక్షణ చేసేందుకు నా రిటైర్డ్ జీవితంలో అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. ఐపీఎస్ గా అధర్మాన్ని , అన్యాయాన్ని , అణచివేతను ఎదుర్కోవడం నా వృత్తిధర్మంగా పనిచేశా.. నేను ఇవాళ పూర్తి సంతృప్తిగా రిటైర్ అవుతున్నా.. నా నిజాయితీ, ధర్మం, పోరాటమే నన్ను కాపాడింది.. రిటైర్ అయినా నా జీవితం ఉన్నంతవరకు ప్రజా సేవలో ఉంటాను అంటూ ప్రకటించారు ఏబీ‌ వెంకటేశ్వరరావు.

Exit mobile version