Sushmita Konidela: మేనకోడలిపై సుస్మిత కొణిదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. క్లీంకార అత్తను టీజ్ చేసి మరీ పారిపోతుందట!

Klin Kaara

Klin Kaara

Sushmita Konidela: మెగాస్టార్ చిరంజీవి మనవరాలు, రామ్ చరణ్-ఉపాసనల గారాల పట్టి క్లీంకార కొణిదెల పేరు వింటేనే మెగా అభిమానుల్లో ఒక తెలియని ఉత్సాహం కనిపిస్తుంది. కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా, మెగా కుటుంబంలోనూ ఈ చిన్నారి తెచ్చిన సందడి అంతా ఇంతా కాదు. కుటుంబంలోకి ఒక చిన్న ప్రాణం అడుగుపెడితే ఆ ఇంట్లోని ఆనందమే వేరు. అది మెగా కుటుంబం లాంటి పెద్ద ఫ్యామిలీ అయితే ఆ సందడి రెట్టింపు అవుతుంది. రామ్ చరణ్ – ఉపాసనల కుమార్తె క్లీంకార రాకతో కొణిదెల నిలయంలో కొత్త కళ వచ్చింది. క్లీంకారకు అత్తగా, ఆమెతో గడుపుతున్న క్షణాలు తన జీవితంలో ఎంతటి మధురమైనవో సుస్మిత కొణిదెల తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. క్లీంకారతో తనకున్న అనుబంధం గురించి మేనత్త సుస్మిత కొణిదెల చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి.

READ ALSO: Marriage: ఆడబిడ్డకు అండగా ‘వైద్యుల’ బృందం.. సోషల్ మీడియా పరిచయం పెళ్లి బంధమైన వేళ..

క్లీంకార గురించి సుస్మిత కొణిదెల మాట్లాడుతూ.. “ఒక మేనత్తగా ఆమెతో సమయం గడపడం నాకు సంతోషాన్ని ఇస్తుంది. క్లీంకార పుట్టిన తర్వాత మా కుటుంబంలో సరికొత్త ఉత్సాహం నెలకుంది” అని మురిసిపోయారు. “క్లింకార ఇప్పుడిప్పుడే మాట్లాడుతుంది. తను నన్ను ఒక ఫ్రెండ్‌లాగా చూస్తుంది. నాతో ఆడుకోవాలని చూస్తుంది, నన్ను టీజ్ చేసి పారిపోతుంది. బలే చిలిపిగా, క్యూట్‌గా ఉంటుంది. అత్తకోడలు మధ్య ఉండే బాండింగ్ న్యాచురల్‌గా వచ్చేసింది తనకు” అని చెప్పారు. మెగా ఫ్యామిలీలో క్లీంకార ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. మేనత్త సుస్మిత చెప్పిన ఈ మాటలు చూస్తుంటే, క్లీంకార కేవలం మెగా వారసురాలు మాత్రమే కాదు, ఆ కుటుంబం మొత్తానికి ఒక ఎనర్జీ బూస్టర్ అని మెగా ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు.

READ ALSO: Sushmita Konidela: ఉపాసనపై సుస్మిత ఆసక్తికర వ్యాఖ్యలు.. “మా మధ్య ఉన్నది కేవలం బంధుత్వం మాత్రమే కాదు!”