సినిమా పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ తెరపై మాత్రమే కాదు, తెర వెనుక కూడా చాలా డ్రామా నడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు మరియు వివాహాల గురించి వచ్చే పుకార్లకు లెక్కే ఉండదు. ఇద్దరు హీరో హీరోయిన్లు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నా, పార్టీలకు కలిసి హాజరైనా, లేదా ఎయిర్‌పోర్ట్‌లో పక్కపక్కన కనిపించినా చాలు.. వెంటనే వారిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని కథనాలు మొదలవుతాయి. ఇలాంటి పుకార్లలో కొన్ని నిజమైతే, చాలా వరకు కేవలం గాలి వార్తలుగా మాత్రమే మిగిలిపోతాయి. ఈ రూమర్ల కారణంగా ఆయా నటీనటులు, లేదా వారి టీమ్‌లు తరచుగా వాటిని ఖండించాల్సి వస్తుంది. అయితే తాజాగా సుశాంత్–మీనాక్షి రిలేషన్ గురించి కూడా క్లారిటి ఇచ్చింది హీరోయిన్ టీమ్..
Also Read : Bigg Boss 9: హీటెక్కిన ఫినాలే రేస్.. డబుల్ ఎలిమినేషన్‌లో రీతూ ఔట్?
టాలీవుడ్ హీరో సుశాంత్, యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరీ వివాహం చేసుకోబోతున్నారని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ వార్తలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది.. మీనాక్షి టీమ్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ‘సుశాంత్‌తో పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు అబద్ధం, ఎవరు ఎలాంటి ప్రచారాన్ని నమ్మవద్దు. సుశాంత్, మీనాక్షి కేవలం మంచి స్నేహితులు మాత్రమే, వారిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ తప్ప మరే ఇతర రిలేషన్ లేదు. మీనాక్షి పెళ్లికి సంబంధించిన ఏ విషయమైనా తామే అధికారికంగా ప్రకటిస్తాం, దయచేసి ఇకనైనా ఈ తప్పుడు ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టండి’ అని మీనాక్షి టీమ్ నెటిజన్లను కోరింది. ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది.
