Site icon NTV Telugu

Suryakumar Yadav: డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ బయటపెట్టిన సూర్య.. గంభీర్ స్పీచ్‌తో ప్లేయర్లలో పూనకాలు!

Suryakumar Yadav Reveals Gautam

Suryakumar Yadav Reveals Gautam

Suryakumar Yadav: భారత్ ప్రపంచ క్రికెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది. మూడు సార్లు టీ20 వరల్డ్ కప్పు సొంతం చేసుకున్న ఏకైక టీమ్‌గా అవతరించింది. ఈ వరల్డ్ కప్పు వెనుక క్రీడాకారులు, కోచ్‌ల కృషి వర్ణణాతీతం. మొదటి నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న టీమ్ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా ఓ ఇంటర్య్వూలో వెల్లడించాడు. గంభీర్ ప్లేయర్స్‌ను ఉద్దేశించి చేసిన ప్రసంగం గురించి అభివర్ణించాడు. గంభీర్ తనదైన శైలిలో జట్టులో స్ఫూర్తిని నింపుతూ.. మనం ఎన్ని వందల ద్వైపాక్షిక సిరీస్‌లు గెలిచామన్నది ఎవరూ గుర్తుంచుకోరని, కానీ ఈ వరల్డ్ కప్ ట్రోఫీ మాత్రం అభిమానుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని స్పష్టం చేశారు. “డ్రెస్సింగ్ రూమ్‌లో మన ముందున్న ఈ ట్రోఫీ కంటే మరేదీ ముఖ్యం కాదు” అంటూ గంభీర్ చెప్పిన మాటలు ఆటగాళ్లలో ఎంతో జోష్ నింపాయని సూర్య పేర్కొన్నాడు.

READ MORE: Dark Spots: ముఖంపై నల్లటి మచ్చలా?.. ఈ హోమ్ రెమిడీస్‌తో ప్రాబ్లం క్లియర్!

“టోర్నీ మొదట్లో గంభీర్‌ను నవ్వించడం మాకు సాధ్యం కాలేదు. టీమిండియా ఫర్ఫామెన్స్‌కు ఫిదా అయ్యారు. ముఖ్యంగా టీ20ల్లో 250, 256 వంటి భారీ స్కోర్లను నమోదు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. అద్భుతంగా ఛేజింగ్ చేస్తున్న తీరును చూసి గంభీర్ ఎంతో మురిసిపోయార. ఫైనల్ గెలిచిన తర్వాత ఆయన ముఖంలో మునుపెన్నడూ లేని చిరునవ్వు కనిపించింది. చివరకు కోచ్ గంభీర్‌ను నవ్వించాం.” అని సూర్య తెలిపాడు. బ్యాక్-టు-బ్యాక్ టీ20 ప్రపంచకప్ టైటిల్స్ సాధించడం వెనకున్న అసలైన వ్యూహాన్ని కెప్టెన్ వెల్లడించాడు. ఈ టోర్నీ భారత్‌లోనే జరుగుతుందని తమకు ముందే తెలుసన్నాడు. అందుకే పరిస్థితులకు తగ్గట్టుగా వ్యూహాలను సిద్ధం చేసుకున్నట్లు స్పష్టం చేశాడు. జట్టులో అందరూ చాలా బాగా అర్థం చేసుకుని, ఒకరిపై ఒకరు శ్రద్ధ వహిస్తూ గెలిపునకు తీసుకెళ్లారన్నాడు. జట్టుకు ఏది అవసరమో దాని గురించి ఆలోచిస్తూ, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆడారని కొనియాడాడు.

READ MORE: SBI SCO Recruitment 2026: ఎస్‌బీఐలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. శాలరీ ఎంతో తెలిస్తే వదులుకోరు

Exit mobile version