Site icon NTV Telugu

Vishwanath Sons: సూర్య ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ ట్రీట్!

Suriya’s Vishwanath & Sons

Suriya’s Vishwanath & Sons

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా ‘కంగువ’ తర్వాత ఆయన నుంచి రాబోతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ‘సార్’ (Sir) వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన వెంకీ అట్లూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ గురించి ఒక సెన్సేషనల్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ సెన్సార్ ఫార్మాలిటీస్ ఇప్పటికే పూర్తయ్యాయి. రాబోయే 10 రోజుల్లోనే ఈ టీజర్‌ను డిజిటల్ మాధ్యమాల్లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. అయితే, కేవలం ఆన్‌లైన్‌లోనే కాకుండా..

Also Read : Dhurandhar 2 : పెయిడ్ ప్రివ్యూస్‌తో ‘స్త్రీ 2’ రికార్డులపై గురి.. ధురంధర్ 2 సెన్సేషనల్ అప్‌డేట్!

థియేటర్లలో కూడా ఈ టీజర్‌ను భారీ స్థాయిలో ప్రదర్శించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మార్చి 19న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి వస్తున్న ‘ధురంధర్ 2’ సినిమాలు విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు థియేటర్లలో సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్‌ను కూడా స్క్రీన్ చేయబోతున్నారు. అంటే మార్చి 19న సినిమా లవర్స్‌కు థియేటర్లలో పండగే అని చెప్పాలి. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version