NTV Telugu Site icon

Suriya: హీరో కాకముందు సూర్య ఏం చేశారో తెలుసా?

Surya

Surya

తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తమిళ్ హీరో అయిన ఆయన సినిమాలు తెలుగులో కూడా రావడంతో ఇక్కడ కూడా మంచిది మార్కెట్ ఉంది.. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే సూర్యకు నార్త్ ఇండస్ట్రీలోనూ క్రేజ్ వస్తోంది.. సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న స్టార్ హీరోలలో ఒకరు సూర్య.. ఆయన నటించిన సినిమాలు అన్నీ కూడా మంచి సక్సెస్ ను అందుకున్నాయి.. అలాగే జైభీమ్ వంటి కంటెంట్ ప్రాధాన్యత చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన సూర్య.. ఆ తర్వాత రోలెక్స్ పాత్రతో రచ్చ చేశారు. కమల్ హాసన్ నటించిన విక్రమ్ లో అతిథిగా కనిపించిన సూర్య..

కేవలం ఐదు నిమిషాలో సీన్‏లో రఫ్పాడించాడు.. స్టార్ హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.. ఈరోజు సూర్య బర్త్ డే. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన అరుదైన పిక్చర్స్ షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు ఫ్యాన్స్.. సినీ అభిమానులు.. బర్త్ డే సందర్బంగా సూర్య గురించి కొన్ని ఆసక్తి కర విషయాలను తెలుసుకుందాం..

హీరో సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. తమిళంలో గుర్తింపు ఉన్న నటుడు శివకుమార్ పెద్ద కొడుకు. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత తన పేరును సూర్య గా మార్చుకున్నాడు. కేవలం నటుడిగానే కాకుండా.. సినీ నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడు.. చెన్నైలోని పద్మా శేషాద్రి బాల భవన్ స్కూల్, సెయింట్ బెడేస్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో విద్య పూర్తిచేశారు. చెన్నైలోని లయోలా కాలేజీలో బి.కామ్ డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు… తన చదువు పూర్తయ్యాక గార్మెంట్ ఫ్యాక్టరీలో మేనేజర్ గా పనిచేశారు.

ఇక 1997లో సినీ ప్రయాణం మొదలుపెట్టారు. మొదటగా విజయ్ దళపతితో కలిసి నెరుక్కు నెర్ లో నటించారు. ఆ తర్వాత 2001లో నందా సినిమాలో మెయిన్ హీరోగా కనిపించారు.. సింగం సిరీస్. సింగం, గజిని చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.. సూరరై పొట్రు చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు. సూర్య 2006లో జ్యోతికను పెళ్లి చేసుకున్నారు.. వీరికి ఇద్దరు పిల్లలు.. ప్రస్తుతం వీరిద్దరూ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు..