NTV Telugu Site icon

Surf Excel: తొలి ఇండియన్‌ బ్రాండ్‌గా అరుదైన రికార్డు

Surf Excel

Surf Excel

Surf Excel: సర్ఫెక్సెల్‌ అంటే తెలియనివారు లేరు. బటల సబ్బుగా, బట్టల సర్ఫ్‌గా బాగా ఫేమస్‌ అయిన ప్రొడక్టు. ఈ బ్రాండ్‌ ఇప్పుడు అరుదైన ఘనత సాధించింది. గతేడాది.. ఒక బిలియన్‌ డాలర్ల సేల్స్‌ పూర్తి చేసుకున్న తొలి ఇండియన్‌ హోమ్‌ అండ్‌ పర్సనల్‌ కేర్‌ బ్రాండ్‌గా రికార్డు నెలకొల్పింది. మొత్తం 8 వేల 200 కోట్ల రూపాయల విక్రయాలతో సరికొత్త మైలురాయిని చేరుకుంది.

Vostro Accounts: విదేశాలతో రూపాయల్లో వాణిజ్యానికి వోస్ట్రో అకౌంట్లు ఎలా పనిచేస్తాయి?

హిందుస్థాన్‌ యూని లీవర్‌ సంస్థలో ఈ ఫీట్‌ సొంతం చేసుకున్న మొట్టమొదటి బ్రాండ్‌ కూడా ఇదే కావటం విశేషం. లిక్విడ్‌ డిటర్జెంట్లు, ఫ్యాబ్రిక్‌ కండిషనర్లతో ఈ సెగ్మెంట్‌ని ప్రీమియమైజేషన్‌ చేయటం వల్ల ఇది సాధ్యమైందని HUL హోం కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ దీపక్‌ సుబ్రమణియన్‌ చెప్పారు. 5 వేల కోట్ల రూపాయల వార్షిక విక్రయాలతో.. బ్రూక్‌ బాండ్‌.. HUL కంపెనీలోని రెండో అతిపెద్ద బ్రాండ్‌గా నిలిచింది.

ఈ సంస్థ.. సర్ఫెక్సెల్‌తోపాటు.. రిన్‌ మరియు సన్‌లైట్‌ పేరుతో మరో రెండు డిటర్జెంట్‌ కేర్‌ బ్రాండ్లను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాలోని డిటర్జెంట్‌ మార్కెట్‌లో ఈ ఉత్పత్తుల వాటా ఏకంగా 43 శాతం కావటం గమనించాల్సిన అంశం. HUL సంస్థ గత దశాబ్ద కాలంలో ఈ రేంజ్‌లో షేర్‌ను కైవసం చేసుకోవటం ఇదే తొలిసారి.

ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ సర్ఫెక్సెల్‌ సేల్స్‌ 32 శాతం జంప్‌ కావటం గొప్ప విషయం. 10 రూపాయల ప్యాకెట్లు అధికంగా అమ్ముడుపోతుండటం వల్ల ఈ రేంజ్‌లో విక్రయాలు నమోదయ్యాయి. సర్ఫెక్సెల్‌ గత మూడు సంవత్సరాలుగా ఈ సెగ్మెంట్‌లో మార్కెట్‌ లీడర్‌లా వెలుగొందుతోంది.

Show comments