భారత మాజీ బ్యాటర్ సురేష్ రైనా 2020 ఆగష్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. రిటైర్మెంట్ ఇచ్చి నాలుగేళ్లు గడిచినా.. తనలో ఏ మాత్రం దూకుడు తగ్గలేదని నిరూపించాడు. అమెరికా వేదికగా నేషనల్ క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్న సిక్స్టీ స్ట్రైక్స్ టోర్నమెంట్‌లో రైనా సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. శనివారం లాస్ ఏంజిల్స్ వేవ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూయార్క్ లయన్స్ తరఫున ఆడుతున్న మిస్టర్ ఐపీఎల్ 28 బంతుల్లో 53 పరుగులు చేశాడు.
37 ఏళ్ల సురేశ్ రైనా తన ఇన్నింగ్స్‌లో ఆరు బౌండరీలు, మూడు సిక్సర్లు బాదాడు. ముఖ్యంగా షకిబ్ అల్ హసన్ ఓవర్‌లో భారీ సిక్సర్లతో చెలరేగాడు. రైనా ధాటికి షకిబ్ ఒకే ఓవర్‌లో 18 పరుగులు సమర్పించుకున్నాడు. అంతేకాదు షకిబ్ మరలా బౌలింగ్‌కు రాలేదు. రైనా బాదిన బౌండరీలు కూడా అద్భుతంగా ఉన్నాయి. రైనా ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ఓ బ్యాటింగ్ సామీ అది’, ‘రైనా భాయ్.. గ్రేట్ షాట్స్’, ‘ముందే ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చావ్ రైనా’ అంటూ ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: Team India: డబుల్ ధమాకా.. టీమిండియాకు ఆ ఇద్దరే కీలకం: దినేశ్ కార్తిక్
ఈ మ్యాచ్‌లో న్యూయార్క్ లయన్స్ నిర్ణీత 10 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. సురేశ్ రైనాతో పాటు ఉపుల్ తరంగ (40; 23 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా చెలరేగాడు. లాస్ ఏంజిల్స్ వేవ్స్ బౌలర్ టైమల్ మిల్స్ మూడు వికెట్లు తీశాడు. ఛేదనలో లాస్ ఏంజిల్స్ 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 107 పరుగులకే పరిమితమైంది. ఆడమ్ రోసింగ్టన్ (31; 15 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్. న్యూయార్క్ బౌలర్ శౌర్య గౌర్ మూడు వికెట్లు పడగొట్టాడు.