Site icon NTV Telugu

Suresh Raina: ఆ మాత్రం కూడా మీకు తెలియదా?.. సురేశ్‌ రైనాపై ఈడీ ప్రశ్నల వర్షం!

Suresh Raina Ed

Suresh Raina Ed

Suresh Raina Questioned by ED Over 1XBET Online Betting App Promotion: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా సినీ, క్రీడా ప్రముఖులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారిస్తోంది. ఇప్పటికే చాలా మంది హీరో, హీరోయిన్స్‌ను ప్రశ్నించిన ఈడీ.. తాజాగా మాజీ క్రికెటర్లు యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌లను కూడా విచారించింది. ఈరోజు 1XBET ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న ‘మిస్టర్ ఐపీఎల్’ సురేశ్‌ రైనాను విచారించింది. రైనాపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో సురేశ్‌ రైనా విచారణకు హాజరయ్యారు. 1Xbet మాత్రమే కాకుండా ఇంకేమైనా ప్రమోట్‌ చేశారా? అని రైనాను ఈడీ అధికారులు ప్రశ్నించారు. 1Xbet బెట్టింగ్‌ యాప్ ప్రమోషన్‌లో మీ పాత్ర ఏంటి?, మీకు బెట్టింగ్‌ ప్లాట్‌ఫామ్‌లతో ఏదైనా ఒప్పందం లేదా లావాదేవీలకు సంబంధించి రికార్డులు ఉన్నాయా? అని అడిగారు. గ్యాంబ్లింగ్‌, అన్‌స్కిల్‌ బేస్డ్‌ గేమ్స్‌ అని మీకు ఎప్పుడూ అనిపించలేదా?, భారత చట్టాల ప్రకారం ఇలాంటి యాప్స్‌ ఇల్లీగల్‌ అని మీకు తెలియదా?, 1Xbet నిర్వాహకులతో మీరు ఎప్పుడైనా కాంటాక్ట్‌ అయ్యారా? అని రైనాను ఈడీ అడిగినట్లు తెలుస్తోంది.

Also Read: Army Jawan: పంజాబ్‌లో సిద్దిపేట జిల్లాకి చెందిన ఆర్మీ జవాన్ మిస్సింగ్!

1xBET బెట్టింగ్ యాప్ కంపెనీ గత సంవత్సరం సురేష్ రైనాను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. అప్పుడు తమ యాప్ బాధ్యతాయుతమైనది అని రైనాతో చెప్పింది. ఇప్పుడు ఈడీ అధికారులు రైనాకు నోటీసులు పంపి.. విచారించారు. రైనాపై ప్రత్యక్ష ఆరోపణలు లేవు. దర్యాప్తులో రైనా పాత్ర ప్రకటనలకే పరిమితం అని తేలితే.. బహుశా అతనికి ఉపశమనం లభించవచ్చు. ఏదైనా ప్రత్యక్ష ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం తీవ్ర ఇబ్బందుల్లో పడతాడు. రైనా భారత్ తరఫున 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20కు ఆడాడు. ఐపీఎల్‌లో ఏకంగా 205 మ్యాచ్‌కు ఆడి 5 వేలకు పైగా రన్స్ చేశాడు.

 

 

Exit mobile version