తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ నటి సురేఖా వాణి పేరు తెలియని వాళ్లు అసలు ఉండరు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించి ఆడియన్స్ లో మంచి గుర్తింపునే సంపాదించుకున్నారు. ఇక సోషల్ మీడియా యూసేజ్ పెరిగిన తరువాత అక్కడ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు గ్లామర్ డోస్ పెంచుతూ, కూతురితో కలిసి రీల్స్ చేస్తుంది.. ఆ వీడియోలు, ఫోటోలు ఎంతగా వైరల్ అవుతుంటాయో మనం చూస్తూనే ఉంటాం.. తాజాగా సురేఖ వాణి తిరుమలలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
జనవరి 8న సురేఖ వాణి తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నడక దారిన శ్రీవాణి శ్రీవారిని చేరుకున్నారు. అలాగే శ్రీవారికి తన తలనీలాలను కూడా అర్పించారు. అనంతరం తోటి భక్తులతో కలిసి కుటుంబంతో సహా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత అక్కడ ఫోటోలు అడిగినవారికి ఫోటోలు ఇచ్చి వారిని సంతోష పరిచారు.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఇక పోతే సురేఖ వాణి కూతురు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. తల్లీ కూతుర్లు చేస్తున్న వీడియో షూట్స్ మాములుగా ఉండవు.. సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా త్వరలోనే సినిమాలోకి రాబోతుందని టాక్ వినిపిస్తుంది. అందుకనే తల్లితో కలిసి సోషల్ మీడియాలో సందడి చేస్తూ, ఆమెతో పాటు పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సందడి వస్తుంది. ఇప్పటికే ఆమె ఎంట్రీ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. మరి సుప్రీత ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాలి..
