కలియుగంలో ఏదైనా జరగవచ్చని చాలా మంది చెబుతుంటారు. అయితే ఈ మధ్య వస్తున్న వార్తలను బట్టి ఇది నిజమే అనిపిస్తోంది. దేశంలో మోసగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు అనేక పద్ధతులను రూపొందిస్తున్నారు. ఇలాంటి కథే గుజరాత్‌లోని సూరత్ నుంచి వెలుగులోకి వచ్చింది. నకిలీ వైద్య పట్టాలను విక్రయిస్తున్న రాకెట్‌ను సూరత్ పోలీసులు గురువారం ఛేదించారు. ఈ కేసులో మొత్తం 13 మందిని అరెస్టు చేశారు. ఇందులో సూత్రధారులు.. నకిలీ సర్టిఫికేట్ల ఆధారంగా వైద్యులుగా పనిచేస్తున్న వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ నకిలీ వైద్యులు రూ.60,000 నుంచి 80,000 చెల్లించి డిగ్రీ పత్రాలను కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ పత్రాలు పొందిన చాలా మంది నిందితులు 12వ తరగతి పరీక్షలో చాలా కష్టంతో ఉత్తీర్ణులయ్యారని చెప్పారు.
READ MORE: Nitish Kumar Reddy: నాకోసం నాన్న ఉద్యోగాన్ని వదిలేశారు.. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం: నితీశ్ రెడ్డి
కేసుకు సూత్రధారి సూరత్ నివాసి రషెష్ గుజరాతీగా గుర్తించారు. అతను సహ నిందితుడు బికె రావత్ సహాయంతో నకిలీ పట్టాలను జారీ చేసేవాడు. గత కొన్నేళ్లుగా చాలా మందికి ఇలాంటి నకిలీ పట్టాలు 1500కు పైగా జారీ చేసినట్లు వెల్లడైంది. నగరంలోని పండేసర ప్రాంతంలో దాడి చేసిన తర్వాత ఈ అరెస్టులు జరిగాయి. క్లినిక్ నడుపుతున్న పలువురు నిందితులను అరెస్టు చేశారు. బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రో హోమియోపతి మెడికల్ సైన్స్ (బిఇఎంఎస్) సర్టిఫికేట్ నకిలీ డిగ్రీ ఆధారంగా వారు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది
READ MORE:Inflation : జేబులు ఖాళీ చేస్తున్న ఆలు, టమోటాలు.. అక్టోబర్లో 7శాతం పెరిగిన ధరలు
ఎలాంటి అవగాహన, శిక్షణ లేకుండానే నిందితులు అల్లోపతి మందులు ఇస్తున్నారని ‘ఫేక్ సర్టిఫికెట్ ఫ్యాక్టరీ’ నడుస్తోందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇలా వందల సంఖ్యలో నకిలీ వైద్యులు రాష్ట్రవ్యాప్తంగా క్లినిక్‌లు నడుపుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ముఠా వైద్యుల క్లినిక్‌లలో పనిచేసే వ్యక్తులను గుర్తించి.. వారి స్వంత క్లినిక్‌లను తెరవడానికి వారికి సర్టిఫికేట్లు అందించేదని దర్యాప్తులో తేలింది. రూ.60 వేల నుంచి 80 వేల వరకు సర్టిఫికెట్లు ఇచ్చారు. మొదట్లో ఆసక్తి ఉన్న వ్యక్తి రెండున్నర సంవత్సరాలు శిక్షణ పొందవలసి ఉంటుందని తెలిపారు. కానీ.. ఎవరూ ఆ శిక్షణ తీసుకోలేదు.