నటి సురేఖ వాణి కుమార్తెగా అందరికీ సుపరిచితమైన ఈ యంగ్ బ్యూటీ, తన కెరీర్ ఆరంభంలోనే అనేక వివాదాలను, ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోంది. అయితే తాజాగా సుప్రీత హీరోయిన్‌గా పరిచయమైన చిత్రం ‘అమరావతికి ఆహ్వానం’. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సుప్రీత తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న దాడి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
Also Read : Suriya – Jyotika: ఆమె లేకపోతే పెళ్లే వద్దన్నాడు.. సూర్య లవ్ స్టోరీలో అసలు నిజాలు చెప్పిన తండ్రి శివకుమార్!
‘మా గురించి తప్పుడు కథనాలు రాసి, మా కన్నీటిని కూడా కొందరు క్యాష్ చేసుకుంటున్నారు’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకునేంత వరకు పరిస్థితి వెళ్ళిందని, కానీ ఇప్పుడు ఆ నెగెటివిటీని తట్టుకునే స్థాయికి చేరుకున్నానని ధైర్యంగా చెప్పింది. గతంలో తాను చేసిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ గురించి మాట్లాడుతూ.. అది తెలియక చేసిన పొరపాటని, ఇప్పుడు ఏ ప్రమోషన్ అయినా లాయర్ సలహా తీసుకున్న తర్వాతే చేస్తున్నామని ఒప్పుకుంది. అలాగే తన తల్లి సురేఖ వాణి రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. “అది కేవలం నా కోరిక మాత్రమే, మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు” అని స్పష్టం చేసింది. నేపోటిజం కంటే టాలెంట్‌నే నమ్ముతానని, తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలో నిలబడతానని సుప్రీత ధీమా వ్యక్తం చేసింది.
