NTV Telugu Site icon

Sai Dharam Tej: ఆ స్టార్‌ దర్శకుడితో సూపర్ హిట్ చిత్రాన్ని మిస్‌ చేసుకున్న సాయి ధరమ్ తేజ్‌..

Sai Dharam Tej

Sai Dharam Tej

Sai Dharam Tej: సుప్రీమ్ హీరో సాయిధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం తనదైన శైలిలో విభిన్న కథలను ఎంచుకుంటూ తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి హీరోగా రాణిస్తున్నాడు. సాయి ధరమ్‌ తేజ్‌ ఇటీవల తన పేరుకు ముందు వాళ్ల అమ్మ పేరును యాడ్‌ చేసుకుని సాయి దుర్గ తేజ్‌గా మారిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదం అనంతరం కొంత విరామం తీసుకున్న మెగా హీరో.. అనంతరం విరూపాక్ష, బ్రో చిత్రాల్లో నటించి రెండు హిట్‌ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఓ ఓ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. దాదాపు 120 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా రోహిత్‌ కేపీ అనే డైరెక్టర్‌ పరిచయం అవుతున్నాడు. హనుమాన్‌ చిత్రంతో పాన్‌ ఇండియా సక్సెస్‌ను సాధించిన నిర్మాత నిరంజన్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read Also: Raja Saab: ప్రభాస్‌ స్టార్‌డమ్‌కు నిజమైన పరీక్ష.. ‘రాజా సాబ్‌’

మరోవైపు, సాయిదుర్గ తేజ్ ఇటీవల ప్రముఖ దర్శకుడు కె. విజయ భాస్కర్ తాజా చిత్రం ‘ఉషా పరిణయం; ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ చిత్రంలో తన్వి ఆకాంక్షతో పాటు దర్శకుడి కుమారుడు శ్రీ కమల్ నటించారు. ఈ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో సాయిదుర్గ తేజ్ తన మొదటి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. విజయ భాస్కర్ దర్శకత్వం వహించిన 2011లో హిట్ అయిన ‘ప్రేమ కావాలి’ సినిమాతో తనను మొదటగా హీరోగా ఎంచుకున్నారని.. దురదృష్టవశాత్తు, ఆ అవకాశాన్ని కోల్పోయానని మెగా హీరో చెప్పుకొచ్చారు. “14 ఏళ్ల క్రితం నా మొదటి సినిమా విజయ్‌భాస్కర్‌ దర్శకత్వంలో చేయాలి.. ఆ సినిమాకు మా మామయ్య పవన్‌కల్యాణ్‌ నిర్మాతగా వుండాలి. అయితే కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. కానీ రేయ్‌ సినిమాతో వైవీఎస్‌ చౌదరి దర్శకత్వంలో హీరోగా పరిచయం అయ్యాను. అయితే నా మొదటి రిలీజైన సినిమా మాత్రం రవి కుమార్‌ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన పిల్లా నువ్వు లేని జీవితం. ” అని సాయిదుర్గ తేజ్ వెల్లడించారు.

Read Also: Tamil Rockers Admin: ‘తమిళ్ రాకర్స్’ అడ్మిన్ అరెస్ట్

అయితే మొదట్లో విజయ్‌భాస్కర్‌ తన చేయాలనుకున్న చిత్రాన్ని అదే కథతో ఆది సాయికుమార్‌తో ‘ప్రేమ కావాలి’ చిత్రాన్ని రూపొందించారని చెప్పారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్‌ గురించి కూడా చెప్పారు. ” నా మొదటి సినిమా రేయ్‌కు మొదటి హీరో ఆది. నా ప్రేమకావాలిలో హీరోగా నటించాడు. సో.. నేను చేయాల్సిన సినిమా ఆది, ఆది చేయాల్సిన సినిమా నేను చేశాను’ అని సాయిదుర్గ తేజ్‌ చెప్పుకొచ్చారు.. ఇక ఇప్పుడు ప్రేమకావాలి సినిమా సాయి ధరమ్ తేజ్ చేసి ఉంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది అని కొందరు మెగా ఫ్యాన్స్, మరికొంతమంది ఎంత పని చేశావ్ అన్న..! ఆ సినిమా ఎలా మిస్ అయ్యావ్..!! అని కామెంట్స్ చేస్తున్నారు.

Show comments