Site icon NTV Telugu

Supreme Court: ఈసీ తప్పు చేస్తే మొత్తం ప్రక్రియను రద్దు చేస్తాం..

Supreme Court

Supreme Court

Supreme Court: సుప్రీంకోర్టులో సోమవారం బీహార్‌లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై విచారణ జరిగింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మ్లయ బాగ్చిలతో కూడిన ధర్మాసనం మాట్లాడుతూ.. ఏ దశలోనైనా కేంద్ర ఎన్నికల సంఘం తప్పుడు పద్ధతిని అవలంబించిందని తేలితే, ఆ పరిస్థితిలో మొత్తం SIR ప్రక్రియను రద్దు చేస్తామని పేర్కొంది. బీహార్ SIRపై తాము ముక్కలుముక్కలుగా అభిప్రాయాన్ని ఇవ్వలేమని స్పష్టం చేసింది. బీహార్‌లోనే కాకుండా భారతదేశం అంతటా SIR ప్రక్రియకు వర్తిస్తుందని ధర్మాసనం తేల్చి చెప్పింది.

READ ALSO: Tirupathi : తిరుపతిలో మిస్టరీ మరణాలు ఊహాగానాలకు తెరలేపిన ఘటనలు

బీహార్‌ ఓటర్ల జాబితాల SIR ప్రక్రియలో ఓటర్ల గుర్తింపు రుజువుగా ఆధార్ కార్డును ‘తప్పనిసరి’గా చేర్చాలని సెప్టెంబర్ 8న జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వును సెప్టెంబర్ 9 నాటికి అమలు చేయాలని కోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఓటర్ల జాబితాల తయారీ, ప్రతి రాష్ట్ర పార్లమెంటు, శాసనసభ ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించడం, అక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా నియంత్రించడం ఈసీ బాధ్యత అని ఎన్నికల కమిషన్ తన కౌంటర్ అఫిడవిట్‌లో పేర్కొంది. “ఈ రాజ్యాంగ నిబంధన ఓటర్ల జాబితాల తయారీ, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని విషయాలలో కమిషన్ పూర్తి అధికారానికి ఆధారం” అని అఫిడవిట్‌లో పేర్కొంది. బీహార్‌లో SIR చెల్లుబాటుపై తుది వాదనలను వినిపించడానికి అక్టోబర్ 7కు సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది.

READ ALSO: Country With Zero Muslim Population: ప్రపంచంలో ఒక్క ముస్లిం కూడా లేని ఏకైక దేశం ఏదో తెలుసా..?

Exit mobile version