NTV Telugu Site icon

Ramdev Baba: రామ్‌దేవ్‌కు సుప్రీంకోర్టు మరో షాక్.. పన్ను చెల్లించాల్సిందేనంటూ హుకుం

Ramdev Baba

Ramdev Baba

యోగా గురువు రామ్‌దేవ్‌ బాబాకు చెందిన పతంజలి యోగపీఠ్ ట్రస్ట్‌కు సుప్రీంకోర్టులో మరో షాక్ ఇచ్చింది. యోగా శిబిరాల నిర్వహణకు వసూలు చేసే ప్రవేశ రుసుముపై సేవా పన్ను చెల్లించాలని రామ్‌దేవ్ ట్రస్ట్‌ను అప్పిలేట్ ట్రిబ్యునల్ కోరింది.. CESTAT నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (CESTAT) యొక్క అలహాబాద్ బెంచ్ అక్టోబర్ 5, 2023 నాటి తీర్పులో జోక్యం చేసుకోవడానికి న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం నిరాకరించింది.

Read Also: Duvvada Srinivas vs Duvvada Vani: భర్తపై ఇండిపెండెంట్‌గా బరిలోకి భార్య..! ఇలా స్పందించిన దువ్వాడ..

ఇక, ట్రస్ట్ అప్పీల్‌ను సుప్రీంకోర్టు ధర్మసనం తోసిపుచ్చింది. పతంజలి యోగపీఠ్ ట్రస్ట్ నిర్వహించే రెసిడెన్షియల్, నాన్-రెసిడెన్షియల్ యోగా క్యాంపులకు హాజరయ్యేందుకు రుసుము వసూలు చేయబడుతుందని ట్రిబ్యునల్ (CESTAT) తన ఆర్డర్‌లో పేర్కొంది. కాబట్టి ఇది ఆరోగ్యం, ఫిట్‌నెస్ సర్వీస్ కేటగిరీలోకి వస్తుంది.. అందుకే, సేవా పన్నును విధించాలన్నారు. ఫీజు క్యాంపులలో యోగా చేయడం ఒక సేవ అని ట్రిబ్యునల్ సరైనదని పేర్కొంది. ఇక, బాబా రామ్‌దేవ్, అతని సహచరుడు ఆచార్య బాలకృష్ణ ఆధ్వర్యంలో పని చేస్తున్న ఈ ట్రస్ట్ వివిధ శిబిరాల్లో యోగా శిక్షణను అందిస్తుంది. యోగా శిబిరాలలో పాల్గొనే వారి నుంచి విరాళాలుగా వసూలు చేసినట్లు ట్రిబ్యునల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ మొత్తాన్ని విరాళంగా సేకరించినప్పటికీ, ట్రస్ట్ సేవలను అందించడానికి రుసుము మాత్రమే.. అందువల్ల ఇది సేవల కింద్రకు వస్తుందని పేర్కొనింది.

Read Also: Question Hour With Etela Rajender: క్వశ్చన్ అవర్‌ విత్ ఈటల రాజేందర్

కాగా, కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్, మీరట్ రేంజ్, అక్టోబర్ 2006 నుం 2011 మార్చి నెల వరకు జరిమానా, వడ్డీతో సహా సుమారు 4.5 కోట్ల రూపాయలను సేవా పన్ను కింద కట్టాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ప్రతిస్పందనగా, పతంజలి యోగపీఠ్ ట్రస్ట్ వ్యాధుల చికిత్సకు సంబంధించిన సేవలను అందిస్తున్నట్లు వాదించింది. హెల్త్ అండ్ ఫిట్‌నెస్ సర్వీసెస్ కింద ఈ సేవలు వస్తాయి.. అందుకే దీనిపై పన్ను విధించబడదని వెల్లడించింది.