NTV Telugu Site icon

Supreme Court : కొలీజియం సిఫార్సులకు గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే ఐదుగురు జడ్జీల నియామకం

Supreme Court

Supreme Court

Supreme Court : ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం చేసిన సిఫారసులను త్వరలోనే ఆమోదిస్తామని ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఇద్దరు న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టుకు పదోన్నతి కల్పించాలని డిసెంబర్‌లో కొలీజియం సిఫార్సు చేసింది. ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, వారి బలం 32 కి పెరుగుతుంది.

Read Also: Bathroom Thief: దొంగతనానికి వచ్చాడు.. ఆపుకోలేక ఎంజాయ్ చేశాడు

భారత ప్రధాన న్యాయమూర్తితో సహా అత్యున్నత న్యాయస్థానానికి మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 34. దీని ప్రస్తుతం వారి బలం 27. న్యాయమూర్తుల నియామకంలో జాప్యంపై దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. కొలీజియం సిఫార్సు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల పదోన్నతిపై త్వరలో స్పష్టత వస్తుందని ప్రభుత్వం తెలిపింది.

Read Also: Milk Price Hike: పాలధరలు మరోసారి పెంపు..లీటర్‌పై ఎంతంటే?

ఈ ఐదుగురి పేర్ల నియామకానికి సంబంధించి త్వరలోనే వారెంట్‌ జారీ చేయనున్నట్లు న్యాయమూర్తులు ఎస్‌కే కౌల్‌, ఏఎస్‌ ఓకాతో కూడిన ధర్మాసనానికి అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణి తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సంబంధించిన సిఫార్సులను క్లియర్ చేయడంలో కేంద్రం జాప్యం చేయడంపై బెంచ్ అసంతృప్తిని వ్యక్తం చేసింది.

Read Also: Cars to employees: ఎంత మంచి కంపెనీనో.. ఉద్యోగులకు కార్లు పంచింది

ఈ క్రమంలోనే బెంచ్ మమ్ములను ఇబ్బంది పెట్టేలా నియామకంలో జాప్యం తీసుకోవద్దని బెంచ్ పేర్కొంది. సుప్రీంకోర్టు కొలీజియం డిసెంబర్ 13న ప్రభుత్వానికి ఐదు పేర్లను సిఫార్సు చేసింది. వారిలో రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పంకజ్ మిథాల్; పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్; మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ P V సంజయ్ కుమార్; పాట్నా హైకోర్టు న్యాయమూర్తి అహ్సానుద్దీన్ అమానుల్లా; అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి మనోజ్ మిశ్రా పేర్లు ఉన్నాయి.