Temple wealth Belongs To Deity: భారత అత్యున్నత న్యాయస్థానం దేవస్థానాలకు సంబంధించిన సంపదపై తాజాగా సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ దేవస్థానం సంపద దేవునిదేనని స్పష్టం చేసింది. దేవస్థానం డబ్బును సహకార బ్యాంకుల మనుగడకు ఉపయోగించరాదని వెల్లడించింది. దేవస్థానం డిపాజిట్లను తిరిగి ఇవ్వాలన్న కేరళ హైకోర్టు ఆదేశాలను కేరళ సహకార బ్యాంకులు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. దీనిపై తాజాగా సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయస్థానం తీర్పులో కేరళ హైకోర్టు తీర్పులో తప్పేమీ లేదని స్పష్టం చేసింది.
READ ALSO: Akhanda 2: ‘అఖండ తాండవం’ ఫైనాన్స్ ఇష్యూస్‌పై సురేష్ బాబు కీలక వ్యాఖ్యలు!
ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ.. ‘సహకార బ్యాంకుల్ని కాపాడటం కోసం గుడి డబ్బుల్ని వాడతారా? దేవుడి డబ్బుల్ని కేవలం గుడి ప్రయోజనాల కోసం మాత్రమే వాడాలి. అది ఆదాయ మార్గం కాకూడదు. సహకార బ్యాంకుల్ని కాపాడే మార్గం అస్సలు కాకూడుదు. సహకార బ్యాంకులు ప్రజల నమ్మకాన్ని పొందాలి. కస్టమర్లను ఆకర్షించలేకపోవటం.. డిపాజిట్లు తెచ్చుకోలేకపోవటం అన్నది సహకార బ్యాంకుల సమస్య’ అని అన్నారు. అనంతరం సుప్రీం న్యాయస్థానం తన తీర్పులో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.
READ ALSO: Vladimir Putin Fitness: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటి.. 73 ఏళ్ల వయసులో కూడా..
