Site icon NTV Telugu

Caste Enumeration: జనగణనలో కులగణనపై సుప్రీంకోర్టులో విచారణ.. కేంద్రానికి నోటీసులు

Supreme Court

Supreme Court

Caste Enumeration: కేంద్రం చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను కులాలవారీగా చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారించింది. కేంద్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై బుధవారం సుప్రీం విచారణ చేపట్టింది. నాలుగు వారాల్లో కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. 8 వారాల అనంతరం తదుపరి విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.

88th marriage: 14 ఏళ్లకే మొదలుపెట్టేశాడట.. 61వ ఏట 88వ పెళ్లి..!

దామాషా పద్ధతిలో జన సంఖ్యను అనుసరించి వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు చట్ట సభల్లోనూ ఓబీసీ రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఆర్. కృష్ణయ్య పోరాడుతున్నారు. బీసీల జన సంఖ్యను తేల్చాలంటే జనాభా లెక్కల సేకరణను కులాలవారిగా చేపట్టడమొక్కటే పరిష్కారమని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం నోటీసులు కేంద్రం వైఖరి ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Exit mobile version