ప్రభుత్వం అందించే ఉచిత సౌకర్యాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచితాలను ప్రకటించే పద్ధతిని కోర్టు ఖండించింది. ప్రభుత్వం నుంచి ఉచిత రేషన్, డబ్బు అందుతున్నందున ప్రజలు పని చేయడానికి ఇష్టపడటం లేదని కోర్టు పేర్కొంది. ఈ వ్యాఖ్యలను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం చేసింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులైన వ్యక్తుల ఆశ్రయం కల్పించే కేసును ధర్మాసనం విచారిస్తోంది.
READ MORE: TG Govt: రైతులకు సర్కార్ శుభవార్త.. వారికి రైతు భరోసా నిధులు
“దురదృష్టవశాత్తు, ఈ ఉచిత సౌకర్యాల కారణంగా ప్రజలు పని చేయడానికి సిద్ధంగా లేరు. వారికి ఉచిత రేషన్ అందుతోంది. ఏ పని చేయకుండానే డబ్బులు తీసుకుంటున్నారు. ప్రజలకు సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడం సరైనదే. కానీ.. ఉచితాల ద్వారా వారిని దేశ అభివృద్ధిలో భాగమయ్యేలా చేయగలుగుతున్నారా? ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించే పద్ధతి సరికాదు.” అని బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌ల బెంచ్ పేర్కొంది.
READ MORE:CM Chandrababu: సైన్స్‌కు టెక్నాలజీ జోడిస్తే అద్భుతాలు.. వైద్య ఖర్చులు తగ్గాలి..
ఈ పిటిషన్‌ను మరో ఆరు వారాల తర్వాత విచారిస్తామని వాయిదా వేసింది. కాగా.. అశ్విని కుమార్ ఉపాధ్యాయ కేసులో ఉచితాల అంశాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే పరిశీలిస్తోందని ఎన్నికల సంఘం తరపున హాజరైన న్యాయవాది సురుచి సూరి కోర్టుకు తెలిపారు. 2023 ఉత్తర్వులను ప్రస్తావిస్తూ ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.