తెలుగు నటి సురేఖవాణి కూతురు సుప్రీత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందే సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది.. ఇప్పుడు బిగ్ బాస్ ఫెమ్ అమర్ దీప్ తో ఓ సినిమా చెయ్యబోతుంది.. ఇటీవలే ఈ సినిమా ను పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు.. ఈ సినిమాను విడుదలకు ముందే జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.. ఈ సందర్బంగా అమర్ దీప్, సుప్రీతలు దావత్ అనే అడల్ట్ షోకి గెస్ట్‌లుగా వచ్చారు..
ఆ షోకు యాంకర్ రీతూ చౌదరి వ్యవహారిస్తున్నారు.. ఈ షో ఎన్నో తెలియని విషయాలు బయటకు వచ్చాయి..మీ లైఫ్‌లో కిక్ చేసే పనులు కొన్ని ఉంటాయి. క్రాక్‌తో చేసే పనులు కొన్ని ఉంటాయి. బలుపుతో చేసే పనులు కొన్ని ఉంటాయి..అలాంటి పనులు మీ ఇద్దరు ఏం చేశారో చెప్పాలని రీతూ కోరింది.. ఆ ప్రశ్నకు ముందుగా సుప్రీత సమాధానం చెప్పింది.. తాను 16 ఏటలోనే లైసెన్స్ లేకుండా కారు నడిపేదాన్ని అది నాకు బాగా కిక్ ఇచ్చిందని చెప్పింది..
అలాగే టెన్త్ క్లాసులో తన తాగుడు యవ్వారాన్ని బయటపెట్టింది. ‘నేను కూడా అలాంటివి చేశాను కానీ చెప్పలేను. నా టెన్త్ క్లాస్‌లో నా తీట పని ఏంటంటే.. నాకు ఓ గ్యాంగ్ ఉండేది.. వారందరికీ నేను నేను మందు తాగించాను.. అది అమ్మకు తెలిసి నన్ను పిచ్చకొట్టుడు కొట్టిందని చెప్పింది. అలాగే తన బాయ్ ఫ్రెండ్ తో ఎవరైనా అమ్మాయి మాట్లాడితే ఆ అమ్మాయిని తన్నేదాన్ని అంటూ ఈ షోలో ఎన్ని సీక్రెట్స్ ను రీవిల్ చేసింది సుప్రీత.. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు..
